Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: కిల్ల‌ర్ కి ఇన్ని రూపాలా

బాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్ట‌ర్ మ‌నోజ్ బాజ్ పాయ్ పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టుడు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 10:45 AM GMT
ట్రైల‌ర్ టాక్: కిల్ల‌ర్ కి ఇన్ని రూపాలా
X

బాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్ట‌ర్ మ‌నోజ్ బాజ్ పాయ్ పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టుడు. క్రైమ్..కామెడీ..సీరియ‌ల్ కిల్ల‌ర్ ఇలా ఏదైనా పాత్ర‌కే వ‌న్నె తేగ‌ల న‌టుడు. అందుకే బాల‌వుడ్ లో అంత గొప్ప న‌టుడిగా ఎదిగాడు. ఇక `ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ తో వ‌ర‌ల్డ్ వైడ్ ఆయ‌న‌కు వ‌చ్చిన గుర్తింపు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగులో ఆయ‌న‌కు మ‌రింత గుర్తింపును తీసుకొచ్చిన వెబ్ సిరీస్ ఇది.

తాజాగా మ‌నోజ్ బాజ్ పాయ్ న‌టిస్తోన్న మ‌రో వెబ్ సిరీస్ `కిల్లర్‌ సూప్‌` గురించి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలవుతున్న ఈ సిరీస్‌కు `ఉడ్తా పంజాబ్`.. `సోంచిరియా` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన అభిషేక్‌ చౌబే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కొంకణ్ సెన్‌శర్మ క‌థ‌నాయిక‌గా న‌టిస్తోంది. సీనియర్ న‌టుడు నాజ‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో వెబ్ సిరీస్ పై మంచి బ‌జ్ క్రియేట్ అవుతుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా నెట్‌ఫ్లిక్స్ ట్రైల‌ర్ రిలీజ్ చేసింది. రెండు నిమిషాల 22 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. స్టోరీ ఏంటి? అన్న‌ది ఎక్క‌డా రివీల్ చేయ‌కుండా ఇంట్రెస్టింగ్ గా ట్రైల‌ర్ క‌ట్ చేసారు. మ‌నోజ్ బాజ్ పాయ్ ర‌క‌ర‌కాల గెట‌ప్స్ లో క‌నిపిస్తున్నాడు. కిల్ల‌ర్ కి ఇన్ని రూపాలున్నాయా? అన్న సందేహం రాక మాన‌దు. ఆ పాత్ర‌ని ర‌క‌ర‌కాల విధాలుగా తీర్చిదిద్ద‌న‌ట్లు క‌నిపిస్తుంది.

క్రైమ్ కామెడీ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా సిరీస్ ని మ‌లిచిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌నోజ్ పాత్ర‌లో కామెడీనే ట్రైల‌ర్ లో హైలైట్ చేసారు. అలాగే గెట‌ప్స్ లు అంతే ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ఓవైపు సీర‌స్ గా స్టోరీ న‌డుస్తోంది. విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రైల‌ర్ మ‌ధ్య‌లో వ‌చ్చే బాంబే సినిమాలోని తూ హీ రేసాంగ్ మ‌రింత ఎంగేజ్ చేస్తుంది. సీరియ‌స్ ట్రైల‌ర్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సాంగ్ ఆడియ‌న్ ని అంతే రిలాక్స్ ని అందిస్తుంది. తెలుగు తో పాటు.. త‌మిళం.. హిందీ.. మ‌ల‌యాళ భాష‌ల్లో జ‌న‌వ‌రి 11 నుంచి ఈ సిరీస్ ప్రీమియ‌ర్ కానుంది. ష‌యాజీ షిండే అనులా నవ్లేకర్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.