Begin typing your search above and press return to search.

సౌత్‌ లో 'కిల్‌' కి పెద్ద స్కెచ్‌..!

బాలీవుడ్‌ లో గత రెండు మూడు సంవత్సరాలుగా భారీ బడ్జెట్‌ సినిమాలు దారుణమైన పరాజయంను మూట కట్టుకుంటున్నాయి

By:  Tupaki Desk   |   16 July 2024 5:44 AM GMT
సౌత్‌ లో కిల్‌ కి పెద్ద స్కెచ్‌..!
X

బాలీవుడ్‌ లో గత రెండు మూడు సంవత్సరాలుగా భారీ బడ్జెట్‌ సినిమాలు దారుణమైన పరాజయంను మూట కట్టుకుంటున్నాయి. హిందీ సినిమా పరిశ్రమలో సక్సెస్ రేటు అత్యంత దయనీయంగా పడి పోయింది. ఇలాంటి సమయంలో వచ్చిన కిల్‌ మూవీ కి అనూహ్య స్పందన దక్కింది.

పెట్టిన పెట్టుబడికి మూడు నాలుగు రెట్ల లాభంను నిర్మాతలకు తెచ్చింది అంటూ కిల్‌ మూవీ గురించి బాలీవుడ్‌ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెద్ద చిత్రాల దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ చిన్న సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో మంచి పబ్లిసిటీ దక్కింది.

గునీత్ మోంగా, అపూర్వ మెహతా మరియు అచిన్‌ జైన్ తో కలిసి కరణ్ జోహార్‌ నిర్మించిన ఈ కిల్‌ మూవీ లో లక్ష్య, తాన్య, రాఘవ్‌ జుయల్‌, అభిషేక్‌ చౌహాన్‌, ఆశిష్ విద్యార్థి, హర్ష్‌ ఛాయా లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. చిన్న స్టోరీ లైన్ తో దర్శకుడు ఈ సినిమాను నడిపించిన తీరు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

హిందీలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిన్న సినిమాను సౌత్‌ లో భారీ చిత్రంగా నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగు కు చెందిన ఇద్దరు ముగ్గురు యంగ్‌ హీరోలు, కొత్త హీరోలు కిల్‌ రీమేక్ రైట్స్ కోసం నిర్మాతలను సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి.

కిల్‌ సినిమాను సౌత్ లో రీమేక్ చేసే ఉద్దేశ్యం ఉందని, అయితే స్వయంగా తామే తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో రీమేక్ చేస్తాం అన్నట్లుగా కరణ్‌ జోహార్‌ ఉన్నాడట. అన్ని భాషల్లో ఒకేసారి వేరు వేరు హీరోలతో, ఒకే సెట్స్ లో షూటింగ్‌ చేసే విధంగా ఏదో పెద్ద స్కెచ్‌ ను కరణ్‌ టీం వేశారని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాదికి సౌత్‌ ప్రేక్షకులకు 'కిల్‌' ఎక్స్‌పీరియన్స్‌ కన్ఫర్మ్‌.