వ్వావ్.. కిమ్ బుట్ట బొమ్మ లుక్!
టాలీవుడ్ ఫేమస్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఇలలో ఇంతందాన్ని చూసి ఉంటే.. బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మా..!
By: Tupaki Desk | 16 July 2024 5:47 AM GMTటాలీవుడ్ ఫేమస్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఇలలో ఇంతందాన్ని చూసి ఉంటే.. బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మా..! అంటూ లిరిక్ రాసేవాడేమో! రోమ్ వెళితే రోమన్ లా ఉండాలి.. ఇండియా వస్తే ట్రెడిషనల్ గా ఉండాలి! అని నమ్మిన అమెరికన్ రియాలిటీ స్టార్ కిమ్ కర్ధాషియన్.. అంబానీ పెళ్లిలో ట్రెడిషనల్ అవతార్ లతో మతులు చెడగొట్టింది. కిమ్ ఆలోచల్లో వైవిధ్యం భారతీయులందరినీ ఆకర్షించింది. సంస్కృతి, సాంప్రదాయాలకు ఎంతో విలువిచ్చే భారతదేశంలో ఒక పెళ్లికి రావడం ఎంత అదృష్టమో కర్ధాషియన్ సిస్టర్స్ కి ఇప్పటికే అర్థమై ఉంటుంది. అంబానీల ఆతిథ్యానికి పరవశించిపోయిన ఈ సిస్టర్స్ ఎంతో సంతోషంగా తిరిగి అమెరికాకు వెళ్లారు.
అయితే కర్ధాషియన్ సిస్టర్స్ అమెరికా వెళ్లినా ఇక్కడ అభిమానులు తనను మర్చిపోలేకపోతున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం కర్ధాషియన్ మనీష్ మల్హోత్రా లెహంగాను ధరించింది. సాంప్రదాయ భారతీయ హస్తకళను సమకాలీన గాంభీర్యంతో అందంగా మిళితం చేసిన డిజైన్ అహూతులను ఆకర్షించింది. ఫ్యాషన్ ప్రపంచంలో భారతీయ డిజైనర్ల ప్రభావాన్ని ఈ లెహంగా డిజైన్ హైలైట్ చేసింది.
భారతదేశానికి తొలిసారి విచ్చేసిన గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్ కిమ్ కర్దాషియాన్ ముంబైలో పెళ్లికి అటెండవ్వడం.. అద్భుతమైన మనీష్ మల్హోత్రా కస్టమ్ మేడ్ డ్రెస్‌లో ప్రత్యక్షమవ్వడం ఒక గొప్ప దృశ్యానుభవం. వైట్ అండ్ గోల్డ్ డిజైనర్ దుస్తుల్లో కిమ్ ఎంతో ట్రెడిషనల్ గా కనిపించింది. కిమ్ లుక్ చూశాక బుట్టబొమ్మ బాపుబొమ్మ అంటూ భారతీయులు ప్రశంసలు కురిపించారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా కిమ్ డిజైనర్ దుస్తుల వివరాలను సోషల్ మీడియాల్లో వెల్లడించారు. కిమ్ రెగ్యులర్ బోల్డ్ లుక్ కి భిన్నమైన రూపమిది. సాంప్రదాయ భారతీయ హస్తకళను సమకాలీన గాంభీర్యంతో సంపూర్ణంగా మిళితం చేసే ఐవరీ లెహంగాను రూపొందించారు. ఆఫ్-షోల్డర్ సిల్క్ బ్లౌజ్ .. సెన్సిటివ్ ఫ్లోరల్ మోడల్.. బంగారు షిమ్మరీ ఎంబ్రాయిడరీ ఈ దుస్తులకు అదనపు ఆకర్షణను పెంచాయి. విలాసవంతమైన ఫాబ్రిక్‌ను సంక్లిష్టమైన డిజైన్‌లతో కలపడం ద్వారా అధునాతన టింజ్ ని జోడించినట్టయింది. తూర్పు - పాశ్చాత్య ఫ్యాషన్ సెన్సిబిలిటీస్ కలయికగా దీనిని రూపొందించారు. భారతదేశంలో కిమ్ తొలి ప్రదర్శనకు ఇది సరైన ఎంపిక.
ఇది భారతీయ ఫ్యాషన్ గ్లోబల్ అప్పీల్‌ను హైలైట్ చేయడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై భారతీయ డిజైనర్ల ప్రభావాన్ని కూడా ఆవిష్కరించింది. భారతీయ వస్త్ర వారసత్వం, ఆధునిక డిజైన్ గొప్పతనాన్ని ప్రతిబింబించే దుస్తులను ఎంచుకోవడం ద్వారా కిమ్ భారతీయ ఫ్యాషన్ తాలూకా శక్తివంతమైన ల్యాండ్‌స్కేప్‌కు నివాళులిచ్చారు. కిమ్ కర్దాషియాన్ లుక్‌ను వీక్షించాక ఇన్‌స్టాగ్రామ్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఫ్యాషన్ ఔత్సాహికులు ప్రశంసలు కురిపించారు.