విజయ్ ‘కింగ్‌డమ్’లో ఏఐ మ్యాజిక్.. టీజర్ అదిరింది!
విజయ్ దేవరకొండ కెరీర్‌కు కీలకంగా మారిన ‘కింగ్‌డమ్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 18 March 2025 6:05 PM ISTవిజయ్ దేవరకొండ కెరీర్‌కు కీలకంగా మారిన ‘కింగ్‌డమ్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. మే 30న గ్రాండ్ రిలీజ్ కోసం సన్నద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఇక తాజాగా మూవీ మేకర్స్ ఒక సరికొత్త ప్రయోగాన్ని చేశారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ మ్యూజిక్‌ను ఆరిజినల్ సౌండ్ ట్రాక్ (OST) రూపంలో విడుదల చేశారు. కానీ ఇందులోని విజువల్స్ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రూపొందించడం విశేషం. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ OST వినసొంపుగా ఉండటమే కాకుండా, ఈ వీడియోలో చూపించిన ఏఐ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
ఈ మ్యూజిక్ వీడియోలోని విజువల్ ప్రెజెంటేషన్ పూర్తిగా ఏఐతో రూపొందించబడింది. చిత్ర నిర్మాతలు సినిమాకి తగ్గట్టుగా ఈ టెక్నాలజీని వినియోగించడం కొత్తదనం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విధంగా టాలీవుడ్‌లో పెద్ద స్థాయిలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించిన తొలి సినిమా ‘కింగ్‌డమ్’ కానుంది.
ఈ ప్రయోగం తెలుగులో ఏఐ వినియోగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే హాలీవుడ్ స్థాయిలో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌ను ఉపయోగించుకుంటున్న టాలీవుడ్, ఇప్పుడు ఏఐ టెక్నాలజీని కూడా మరింత విస్తృతంగా ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది. ‘కింగ్‌డమ్’ ఈ మార్గంలో తొలి అడుగు వేసినట్టుగా కనిపిస్తోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ మాస్ లుక్, విస్తృతమైన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఏఐ టెక్నాలజీని వాడుతూ రూపొందించిన ఈ OST మరిన్ని సినిమాలకు మార్గదర్శకంగా నిలుస్తుందా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ నిర్మిస్తున్నారు.