Begin typing your search above and press return to search.

ప్రభాస్ కల్కి.. నాగార్జున రెస్పాన్స్ ఏంటంటే?

పాన్ ఇండియా మోస్ట్ అవైట్డ్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

By:  Tupaki Desk   |   23 Jun 2024 9:53 AM GMT
ప్రభాస్ కల్కి.. నాగార్జున రెస్పాన్స్ ఏంటంటే?
X

పాన్ ఇండియా మోస్ట్ అవైట్డ్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ హీరో ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కిని భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై వేరే లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉండనున్న ఈ చిత్రం కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్ ఎలా దుమ్మురేపుతుందో తెలిసిందే. యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళితో పాటు పలువురు సెలబ్రిటీలు కల్కి ట్రైలర్ పై నెట్టింట స్పందించారు. మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. తాజాగా కింగ్ నాగార్జున రెస్పాండ్ అయ్యారు.

అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ పెద్దగా యాక్టివ్ గా ఉండని నాగ్.. నేడు కల్కి ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. "ఏం ప్రపంచం.. సృష్టించారు మీరు నాగీ!!! మన భారతదేశపు అపురూపమైన కథలను తెరపైకి తీసుకువస్తున్నారు!! చిత్రాన్ని చూసేందుకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాను.. ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాను!! అమిత్ జీ ఫైర్.. కమల్ జీ జస్ట్ వావ్!! ప్రభాస్.. ప్రయోగాలు చేసే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.

కల్కి మేకర్స్ అయిన అశ్వినీదత్, స్వప్న దత్, స్వీటీని తన ఫేవరేట్ నిర్మాతలుగా పేర్కొంటూ.. ఆల్ ది బెస్ట్ చెప్పారు నాగార్జున. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని రాసుకొచ్చారు. ప్రస్తుతం నాగ్ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అయితే నాగార్జున.. సినిమాల కోసం పెద్దగా ట్వీట్ చేయడం ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇంతలా ప్రశంసలు కురిపించారంటే.. కల్కి రేంజ్ ఎలా ఉందో తెలుస్తుందని అంటున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. అమెరికాలో కల్కికి పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా త్వరలోనే మొదలు కానున్నాయి. ఇక్కడ కూడా రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరిగే అవకాశం ఉంది. మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్ తో మూవీని ఫస్ట్ డే చూడాలని ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని సినీ పండితులు అంటున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.