Begin typing your search above and press return to search.

కింగ్స్టన్ ట్రైలర్: సముద్రపు లోతుల్లో అంతుచిక్కని రహస్యం

జీవీ ప్రకాష్ కుమార్ 25వ సినిమాగా రానున్న ఈ చిత్రం సముద్రపు లోతుల్లో దాగున్న రహస్యాల కథను వెల్లడించబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

By:  Tupaki Desk   |   28 Feb 2025 2:38 PM IST
కింగ్స్టన్ ట్రైలర్: సముద్రపు లోతుల్లో అంతుచిక్కని రహస్యం
X

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో బిజీబిజీగా హిట్స్ అందుకుంటున్న జీవి ప్రకాష్ కుమార్ హీరోగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈసారి అతను మరో డిఫరెంట్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమాతో రాబోతున్నాడు. ఇండియన్ సినిమా పరిశ్రమలో మొదటిసారి సముద్ర అడ్వెంచర్ ఫాంటసీగా కింగ్స్టన్ సినిమా రూపొందింది. ఇక సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.


తెలుగులో ఈ సినిమాను గంగా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మహేశ్వర్ రెడ్డి గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి హైప్ క్రియేట్ చేసుకుంటోంది. జీవీ ప్రకాష్ కుమార్ 25వ సినిమాగా రానున్న ఈ చిత్రం సముద్రపు లోతుల్లో దాగున్న రహస్యాల కథను వెల్లడించబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గోకుల్ బెన్నోయ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా, విజువల్ ట్రీట్‌లా కనిపిస్తోంది. ట్రైలర్‌ నేరుగా మిస్టరీ మూమెంట్‌తో ప్రారంభమవుతుంది. ఒక అద్భుతమైన కోస్టల్ విలేజ్‌ను పరిచయం చేస్తూ, సముద్రపు నడుమ నిగూఢమైన సంఘటనలు ఏవో చోటుచేసుకుంటున్నట్లు చూపించారు.


జీవీ ప్రకాష్ కుమార్ 25వ సినిమాగా రానున్న ఈ చిత్రం సముద్రపు లోతుల్లో దాగున్న రహస్యాల కథను వెల్లడించబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గోకుల్ బెన్నోయ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా, విజువల్ ట్రీట్‌లా కనిపిస్తోంది. ట్రైలర్‌ నేరుగా మిస్టరీ మూమెంట్‌తో ప్రారంభమవుతుంది. ఒక అద్భుతమైన కోస్టల్ విలేజ్‌ను పరిచయం చేస్తూ, సముద్రపు నడుమ నిగూఢమైన సంఘటనలు ఏవో చోటుచేసుకుంటున్నట్లు చూపించారు.

చావులు దినాలు.. ఘటనలతో సతమతమవుతున్న గ్రామంలో అంతు చిక్కని అగాధం ఉన్నట్లు హైలెట్ చేశారు. అక్కడ ఉన్న గ్రామస్థులకు తెలియని ఓ ఆశకు, దురాశకు మధ్య ముడిపడిన కథ అని అర్థమవుతుంది. కింగ్స్టన్ పాత్రలో జీవీ ప్రకాష్ కుమార్ కనిపిస్తుంటే, అతని పాత్రలోని ఇన్‌టెన్సిటీ ఆసక్తికరంగా ఉంది. కింగ్‌స్టన్ క్యారెక్టర్ మిస్టీరియస్‌గా ఉండటమే కాదు, తన బాధ్యతను తెలుసుకుని పోరాడేలా కనిపిస్తోంది.

సముద్రం లోపల ఏదో ప్రమాదకరమైనది దాగి ఉందని సూచించే విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. దివ్యాభారతి, చెతన్, అళగం పెరుమాల్, ఎలంగో కుమారవేల్ వంటి తారాగణం కూడా ట్రైలర్‌లో కనిపించి ఆసక్తిని రేపారు. కింగ్‌స్టన్ ట్రైలర్‌ మొత్తం టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ సీన్స్ హై ఓక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉన్నాయని తెలుస్తోంది.

సినిమాటోగ్రాఫర్ గోకుల్ బెన్నోయ్ సముద్ర దృశ్యాలను సాలీడ్ గా చూపిస్తూ ప్రేక్షకులను మాయలో ముంచెత్తేలా తీర్చిదిద్దారు. ఇక జీవీ ప్రకాష్ సంగీతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా అదిరిపోయేలా ఉంది. ట్రైలర్ మొత్తంలో కథ గురించి స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా, మిస్టరీని కొనసాగిస్తూ ఉంచడం మేకర్స్ ప్లాన్ అని స్పష్టమవుతోంది. సముద్రపు లోతుల్లో ఏదో అద్భుతమైనదో, ప్రమాదకరమైనదో దాగి ఉందని సంకేతాలు ఇచ్చారు. అసలు కింగ్స్టన్ ఎవరికి వ్యతిరేకంగా పోరాడతాడు? సముద్రం లోపల దాగున్న రహస్యమేంటి? అక్కడ దెయ్యాలు ఎందుకున్నాయి? అన్నదానికి సమాధానం తెలియాలంటే సినిమా వరకు వేచి చూడాల్సిందే.

ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 2025, మార్చి 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మెరైన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఇలాంటి కథ ఇంతవరకు ఇండియన్ సినిమా పరిశ్రమలో రాలేదు. అందుకే, సినిమా విజువల్‌గా అద్భుతమైన అనుభూతిని అందించబోతుందని ట్రైలర్ స్పష్టంగా చెప్పింది. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి, ఈ సముద్రపు మిస్టరీ థ్రిల్లర్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.