Begin typing your search above and press return to search.

కిరణ్ అబ్బవరం 'క' ట్రైలర్.. చీకటి ఊర్లో ఓ రహస్యం

సుజీత్, సందీప్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో న‌య‌న్ సారిక‌, త‌న్వీ రామ్ క‌థానాయిక‌లుగా నటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 5:18 AM GMT
కిరణ్ అబ్బవరం క ట్రైలర్.. చీకటి ఊర్లో ఓ రహస్యం
X

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చిత్రాలతో సినీ ప్రియులను మెప్పించిన ఆయన.. ఇప్పుడు తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'క' తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సుజీత్, సందీప్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో న‌య‌న్ సారిక‌, త‌న్వీ రామ్ క‌థానాయిక‌లుగా నటిస్తున్నారు. భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఆ చిత్రం.. దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఫైనల్ గా ట్రైలర్ ను విడుదల చేశారు.


తెలుగుతో పాటు త‌మిళ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాషల్లో అక్టోబర్ 31వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, రెండు సాంగ్స్.. ఓ రేంజ్ లో సినీ ప్రియులను అలరించాయి. కచ్చితంగా మూవీ చూడాలనేంతగా హైప్ క్రియేట్ చేశాయి. సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్.. ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచారు. శుక్రవారం ఉదయం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అతని ప్రపంచం ఆసక్తికరం.. అతని ప్రయాణం ఒక రహస్యం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అంతకుముందు.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జరిగిన ఈవెంట్‌ లో థియేట్రికల్ ట్రైలర్‌ ను ఆవిష్కరించారు. దేవ దేవ అంటూ ఓల్డ్ సాంగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ వెంటనే చిన్న యాక్షన్ సీక్వెన్స్ బిట్ తో ఒక్కసారిగా ఆసక్తి రేపింది. ఆ తర్వాత కొండల నడుమ 3 గంటలకే చీకటి పడే కృష్ణ గిరి గ్రామాన్ని మేకర్స్ పరిచయం చేశారు. అందులో పోస్ట్ మ్యాన్ గా ఉద్యోగంలో అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) చేరుతారు. అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడతారు. ఉత్తరాలు పంచే క్రమంలో అభిషేక్ పేరుతో వచ్చిన లెటర్ హీరో జీవితాన్ని మలుపు తిప్పుతుంది.

ఆ తర్వాత లెటర్ లో ఏముందో చెప్పమని ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి.. వాసుదేవ్ ను బెదిరిస్తాడు. అసలు ఆ ఉత్తరంలో ఏముంది? హీరోను ఓ గ్యాంగ్ ఎందుకు బెదిరిస్తున్నారు? దాని వెనుక ఉన్న కారణం ఏంటి? సినిమాలో మరో మెయిన్ ట్విస్ట్ ఏంటి?.. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో క సినిమా ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని అంతా చెబుతున్నారు. అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేస్తుందని అంటున్నారు. ఫుల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని కామెంట్లు పెడుతున్నారు.

ముఖ్యంగా కిరణ్ అబ్బవరం యాక్షన్ సన్నివేశాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. తన నేచురల్ యాక్టింగ్ తో అలరించారు. డైలాగ్స్ తో మెప్పించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్‌ అంకితభావం ప్రతి ఫ్రేమ్‌లో కూడా కనిపిస్తుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మంచి కంటెంట్ తో మూవీ రాబోతున్నట్లు మేకర్స్.. ట్రైలర్ ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చారు. చింతా గోపాలకృష్ణారెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. మరి కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.