మార్కో చూడలేక మధ్యలోనే వచ్చేశామన్న కిరణ్
అందులో భాగంగానే కిరణ్ ఇటీవల వచ్చిన మార్కో మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
By: Tupaki Desk | 14 March 2025 1:40 PM ISTగతేడాది క మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు దిల్ రూబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. దిల్ రూబా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం అడిగిన అందరికీ ఇంటర్వ్యూలిస్తూ సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు.
అందులో భాగంగానే కిరణ్ ఇటీవల వచ్చిన మార్కో మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మార్కో సినిమాను తాను థియేటర్ లో పూర్తిగా చూడలేకపోయానని అన్నాడు. సినిమా చాలా వయొలెంట్ గా ఉందని, అందుకే సినిమా మధ్యలో నుంచే చూడకుండా వచ్చేశామని తెలిపాడు. తన భార్య ప్రెగ్నెంట్ అవడంతో తనకు అన్‌కంఫర్టబుల్ గా అనిపించడంతో మూవీ చూడకుండా బయటకు వచ్చేసినట్టు కిరణ్ చెప్పుకొచ్చాడు.
ఇలాంటి సినిమాల ఎఫెక్ట్ ఆడియన్స్ పై పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు కానీ కొంతమంది మా లానే అసౌకర్యంగానే ఫీలయ్యే ఛాన్సుందనన్నాడు. అలా అని ఆ మూవీలోని పాటలు, సీన్స్ ను వదిలేయడం లేదని, మార్కో లాంటి సినిమాల ఎఫెక్ట్ వయసును బట్టి మారుతూ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
మార్కో సినిమా ఎంత వయొలెంట్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ఈ సినిమాను టీవీలో టెలికాస్ట్ చేయకూడదని ఆదేశించారు. అయితే ఈ సినిమా థియేటర్లలో, ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. కిరణ్ కూడా తన భార్య ప్రెగ్నెంట్ కావడం వల్లే తమకు అసౌకర్యంగా ఉందన్నాడు తప్పించి సినిమా బాలేదనలేదు.
ఇక దిల్ రూబా సినిమా విషయానికొస్తే తమ సినిమా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉంటుందని, ముఖ్యంగా ఈ సినిమాలో మహిళల ఎమోషన్స్ ను చాలా బాగా చూపించామని, మహిళలకు దిల్ రూబా ఎక్కువ కనెక్ట్ అవుతుందని కిరణ్ చెప్పాడు. మరి క మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ నుంచి వచ్చిన దిల్ రూబా చివరకు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.