పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గాలెం వేస్తున్న యువ హీరో..!
ముఖ్యంగా ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు వాడినట్టు తెలుస్తుంది.
By: Tupaki Desk | 10 March 2025 11:37 PM ISTకిరణ్ అబ్బవరం హీరోగా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్, కాథి డేవిసన్ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రచార చిత్రాక్లు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. ఐతే సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఆసక్తి పెంచగా లేటెస్ట్ గా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా వచ్చిన ప్రోమో అదిరిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు వాడినట్టు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి స్టైల్ లో కుర్చీని తిప్పడం, సాంగ్ లో పవన్ పోస్టర్ ఉన్న డోర్ నుంచి కిరణ్ అబ్బవరం రావడం ఇదంతా చూస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కిరణ్ అబ్బవరం గాలెం వేస్తున్నట్టుగానే ఉందనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం కూడా పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారిలో ఒకడు. సినిమాలో పవర్ స్టార్ రిఫరెన్స్ ఐడియా ఎవరిదో కానీ అది అతని సినిమాకు కలిసి వచ్చేలా ఉంది.
దిల్ రూబా సినిమా విషయంలో కిరణ్ అబ్బవరం కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. క సినిమా ముందు వరకు కాస్త ట్రాక్ తప్పిన కిరణ్ అబ్బవరం ఇక మీదట ఫోకస్ తో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. క సినిమా ఇచ్చిన సక్సెస్ కూడా అతని కెరీర్ జోష్ అందుకునేలా చేసింది. దిల్ రూబా సక్సెస్ కొడితే హీరోగా కిరణ్ అబ్బవరం గ్రాఫ్ మరింత పైకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది తోడు ఉంటుంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా సరే కిరణ్ అబ్బవరం తన ప్రైత్భని నమ్ముకుని సినిమాల్లోకి వచ్చాడు సిన్సియర్ ఎఫర్ట్ పెడుతూ ప్రయత్నాలు చేస్తున్నాడు. క సినిమా ముందు వరకు కిరణ్ పని అయిపోయింది అనుకున్న వారికి ఆ సినిమా ఫలితంతో తన సత్తా చాటాడు. మై దిల్ రూబా కూడా అదే తరహాలో సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. క తర్వాత క సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం తప్పకుండా క అంచనాలను మించేలా ఆ సినిమా ఉంటుందని అంటున్నారు.