Begin typing your search above and press return to search.

దిల్ రూబా సెన్సార్ టాక్..!

యువ హీరోగా తన సినిమా సినిమాకు ప్రత్యేకత చాటుతూ వస్తున్న కిరణ్ అబ్బవరం దిల్ రూబాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడన్నది మరో మూడు రోజుల్లో తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   12 March 2025 1:38 AM IST
దిల్ రూబా సెన్సార్ టాక్..!
X

యువ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ లో విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. క సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలన్నీ కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి. దిల్ రూబా సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఐతే కిరణ్ అబ్బవరం మార్క్ కమర్షియల్ మాస్ అంశాలు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలైతే బాగున్నాయి. ఇక రిలీజ్ మూడు రోజు ఉందగా దిల్ రూబా సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకుంది. దిల్ రూబా సినిమా సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది. సినిమా చిన్నా పెద్దా అందరు చూసేలా సెన్సార్ టీం సర్టిఫికెట్ అందిచింది. ఐతే దిల్ రూబా సినిమాలో కిరణ్ అబ్బవరం క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్, కాథి డెవిసన్ హీరోయిన్స్ గా నటించారు. సాం సిఎస్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. కిరణ్ నుంచి కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా దిల్ రూబా రాబోతుంది. ఐతే ట్రైలర్ కట్ కమర్షియల్ యాక్సెప్ట్ తో ఉన్నా కూడా సినిమాలో ఎమోషనల్ పార్ట్ కూడా సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. సెన్సార్ నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినట్టే తెలుస్తుంది.

యువ హీరోగా తన సినిమా సినిమాకు ప్రత్యేకత చాటుతూ వస్తున్న కిరణ్ అబ్బవరం దిల్ రూబాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడన్నది మరో మూడు రోజుల్లో తెలుస్తుంది. ఈ సినిమాపై కిరణ్ అబ్బవరం మాత్రం చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. క ముందు వరుస సినిమాలు నిరాశపరచడంతో కిరణ్ అబ్బవరం పని అయిపోయిందని అనుకున్నారు. కానీ క తో తన సత్తా ఏంటో చూపించాడు. ఇక మీదట అన్ని కొత్త కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాడు కిరణ్ అబ్బవరం. దిల్ రూబా ప్రచార చిత్రాలతో ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ ఏర్పడగా సినిమా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.