Begin typing your search above and press return to search.

కిరణ్ అబ్బవరం.. వ్వాటే లుక్

అంతకుముందు వరుస ఫెయిల్యూర్స్ తో వచ్చిన డ్యామేజ్ మొత్తాన్ని ఈ చిత్రం క్లియర్ చేసేసింది.

By:  Tupaki Desk   |   12 Dec 2024 4:40 AM GMT
కిరణ్ అబ్బవరం.. వ్వాటే లుక్
X

‘క’ మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా 50 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంది. ఒక చిన్న హీరో సినిమాకి ఈ స్థాయిలో వసూళ్లు అంటే కచ్చితంగా రికార్డ్ అని చెప్పాలి. ‘క’ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం ఇమేజ్ కూడా పెరిగింది. అంతకుముందు వరుస ఫెయిల్యూర్స్ తో వచ్చిన డ్యామేజ్ మొత్తాన్ని ఈ చిత్రం క్లియర్ చేసేసింది.

ఆయన కంప్లీట్ చేసిన దిల్ రుబా అనే మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రావొచ్చని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కిరణ్ అబ్బవరం కొత్త సినిమాకి సంబందించిన కీలక ప్రకటన వచ్చింది. ‘KA 10’ వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ లో ఉందంట. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ కోసం కిరణ్ అబ్బవరం తన లుక్ మార్చేశాడు. కంప్లీట్ గా స్టైలిష్ అవతార్ లో కనిపిస్తున్నాడు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రిమ్ హెయిర్ కట్ తో కళ్లద్దాలు పెట్టుకున్న కిరణ్ అబ్బవరం లుక్ కొత్తగా ఉందనే మాట వినిపిస్తోంది. ‘క’ తో గేర్ మార్చిన కిరణ్ ఇకపై విభిన్న కథలతోనే మూవీస్ చేస్తానని తెలిపాడు. ప్రేక్షకులకి కావాల్సింది ఇవ్వడానికి కొత్త కొత్త స్టోరీస్ తో ముందుకొస్తానని అన్నారు.

త్వరలో ఎనౌన్స్ కాబోయే ఈ ‘KA 10’ మూవీ ఎలాంటి కథతో కిరణ్ అబ్బవరం చేయనున్నాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడంటే కచ్చితంగా ఈ ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని ట్రై చేయబోతున్నాడనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా ఆడియన్స్ మాత్రం ప్రస్తుతం కొత్తదనం ఉన్న కథలపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

అలాగే వినోదాత్మక కథలకి పెద్దపీట వేస్తున్నారు. కిరణ్ అబ్బవరంలో మంచి కామెడీ టైమింగ్ కూడా ఉన్న నేపథ్యంలో వినోదాత్మక కథలపైన కూడా అతను ఫోకస్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ప్రయోగాలు చేస్తూనే యూత్ ఫుల్ క్రేజీ స్టోరీస్ ని తెరపై ఆవిష్కరిస్తూ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.