ట్రెండింగ్ కి తగ్గట్టుగా K - ర్యాంప్..
'క' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని మంచి జోరు మీద ఉన్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమాని తాజాగా ప్రారంభించారు.
By: Tupaki Desk | 3 Feb 2025 6:07 AM GMT'క' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని మంచి జోరు మీద ఉన్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమాని తాజాగా ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీతో జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ఈ సినిమాకి క్లాప్ కొట్టారు.
అలాగే బడా నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ మూవీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి వినూత్నంగా ‘K - ర్యాంప్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. సోషల్ మీడియాలో ఈ పేరు బాగా పాపులర్. ఏదైనా సినిమా నచ్చినప్పుడు ఫ్యాన్స్ ఈ పదాన్ని కామన్ గా ఉపయోగిస్తారు. మోస్ట్ ట్రెండింగ్ వర్డ్స్ లలో ఒకటిగా ఇది సోషల్ మీడియాలో ఉంది.
ఇప్పుడు కిరణ్ అబ్బవరం కొత్త సినిమాకి కూడా అదే టైటిల్ పెట్టడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ‘K - ర్యాంప్’ అనేదాంట్లో K అంటే కుమార్ అని మీనింగ్. అంటే కుమార్ గాడి ర్యాంప్ అనే అర్ధం వచ్చేలా ఈ టైటిల్ ని సినిమాకి పెట్టి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారంట. కేరళ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ నడుస్తుందని సమాచారం. సినిమాలో కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ హైఎనర్జిటిక్ గా ఉంటుందంట.
ఈ మూవీలో కిరణ్ అబ్బవరంకి జోడీగా ‘రంగబలి’ ఫేమ్ యుక్తి తరేజా కనిపించబోతోంది. మూవీ లాంచింగ్ లో హీరోయిన్ కూడా పాల్గొంది. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ వస్తోన్న మూడో సినిమా ఇది కావడం విశేషం. కిరణ్ అబ్బవరం, యుక్తిపైన ఫస్ట్ షాట్ కి దిల్ రాజు క్లాప్ కొట్టారు. అనిల్ సుంకర కెమెరా ఆన్ చేశారు. యోగి ఫస్ట్ షాట్ ని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ప్రారంభోత్సవంలో విజయ్ కనకమేడల, రామ్ అబ్బరాజు, యదువంశీ పాల్గొన్నారు.
ఈ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీతో కిరణ్ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే హాస్య మూవీస్ బ్యానర్ లో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘మజాకా’ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని త్రినాథ్ రావు నక్కిన రెడీ చేశారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. దీని తర్వాత హాస్య మూవీస్ నుంచి ఈ K - ర్యాంప్ రాబోతోంది.