టేబుల్ ప్రాఫిట్ తోనే సేఫ్ అయిన 'క'
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ తో తనని తాను కొత్తగా రిప్రజెంట్ చేసుకుంటూ మూవీస్ చేస్తున్నాడు.
By: Tupaki Desk | 31 Oct 2024 3:58 AM GMTయంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ తో తనని తాను కొత్తగా రిప్రజెంట్ చేసుకుంటూ మూవీస్ చేస్తున్నాడు. ఆయన నటించిన థ్రిల్లర్ మూవీ ‘క’ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాకి ప్రీమియర్ షోలు కూడా వేశారు. ఈ మూవీ ట్రైలర్ తోనే ఒక పాజిటివ్ బజ్ సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్స్ కూడా చాలా యాక్టివ్ గా చేశారు. కిరణ్ ఆబ్భవరం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఈ మూవీ నచ్చకపోతే కచ్చితంగా సినిమాలు చేయడం మానేస్తానంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఛాలెంజ్ చేసి చెప్పారు. దీన్నిబట్టి అతను ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ తో థియేటర్స్ లోకి వచ్చింది. ఈ చిత్రానికి కిరణ్ అబ్బవరం రెమ్యూనరేషన్ కాకుండా 15 కోట్లు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఆయన కూడా ఈ సినిమాకి సహా నిర్మాతగా ఉన్నారు. రెమ్యునరేషన్ మినహాయించుకుని ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటున్నారు.
కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ఈ సినిమాకి ఖర్చు చేశారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. అలాగే డిజిటల్ రైట్స్ ని ఈటీవీ దాదాపు 10 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. అంటే సినిమా రిలీజ్ కి ముందే పెట్టిన పెట్టుబడి మొత్తం రికవరీ కావడంతో పాటు 6 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్లు సమాచారం. ఇక థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి వచ్చిన లాభాలు అన్నీ కూడా ప్రాఫిట్ లోకి వెళ్తాయి.
అలాగే ఇతర భాషలలో ఏమాత్రం మంచి వసూళ్లు వచ్చిన కూడా మూవీకి కలెక్షన్స్ పరంగా మంచి అడ్వాంటేజ్ లభించినట్లే అనుకుంటున్నారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో కచ్చితంగా భారీ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని మేకర్స్ భావిస్తున్నారు. ఫెస్టివల్ వీకెండ్ లో ఆడియన్స్ కి కావలసినంత థ్రిల్ ను చిత్రం అందిస్తుందని అంచనా వేస్తున్నారు. ‘క’ మూవీ సక్సెస్ అయితే కచ్చితంగా కిరణ్ అబ్బవరం కెరియర్ మరలా ట్రాక్ లో పడుతుంది.
అలాగే తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ కూడా క్రియేట్ చేసుకుని అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ కెరియర్ పరంగా కిరణ్ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో కమర్షియల్ రేస్ లోకి కిరణ్ మెల్లగా వస్తున్నాడు. కిరణ్ అబ్బవరంతో సినిమాలు చేయడానికి పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు సిద్ధంగా ఉన్నాయి. మినిమం గ్యారంటీ హీరోగా కిరణ్ అబ్బవరం మారే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.