Begin typing your search above and press return to search.

కిరణ్ అబ్బవరం 'క' - ఓవర్సీస్ లెక్క ఎలా ఉందంటే..

ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో ఓవరాల్ గా 774K డాలర్స్ కలెక్ట్ చేసింది. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 6.53 కోట్లు వసూళ్లని అందుకున్నట్లు.

By:  Tupaki Desk   |   20 Nov 2024 7:48 AM GMT
కిరణ్ అబ్బవరం క - ఓవర్సీస్ లెక్క ఎలా ఉందంటే..
X

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా 'క' మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. డిఫరెంట్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఏకంగా 50 కోట్లకి పైగా కలెక్షన్స్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకుంది. ఒక చిన్న హీరో సినిమాకి ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం అంటే సంచలనం అని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచి ఆడియన్స్ లో ఒక హైప్ క్రియేట్ చేసింది.

దానికి తగ్గట్లుగానే రిలీజ్ తర్వాత కూడా ప్రేక్షకులని పూర్తిగా ఎంగేజ్ చేసి సూపర్ టాక్ సొంతం చేసుకుంది. దీనికి పోటీగా అమరన్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు ఉన్న కూడా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కిరణ్ అబ్బవరం ఏడాదికి ఒక సినిమా చేసిన సక్సెస్ లు రావనే విమర్శలకి 'క' మూవీతో ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి. అలాగే పెర్ఫార్మెన్స్ పరంగా కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో తనలో వేరియేషన్స్ ని చూపించారు.

'క' మూవీతో అతని స్టోరీ సెలక్షన్ మీద ఆడియన్స్ కి నమ్మకం పెరిగింది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు అందుకుంది. నిజానికి చిన్న హీరోల సినిమాలకి ఓవర్సీస్ లో పెద్దగా ఆదరణ లభించదు. అయితే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు రావడంతో ఆడియన్స్ ఆసక్తి చూపించాడు. మౌత్ టాక్ కూడా పబ్లిక్ నుంచి బాగా రావడంతో ఓవరాల్ గా మంచి వసూళ్లని అందుకుంది.

ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో ఓవరాల్ గా 774K డాలర్స్ కలెక్ట్ చేసింది. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 6.53 కోట్లు వసూళ్లని అందుకున్నట్లు. ఈ స్థాయిలో వసూళ్లని సాధించిందంటే నిజంగా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇలాంటి ఇంటరెస్టింగ్ కథలతో కిరణ్ అబ్బవరం భవిష్యత్తులో సినిమాలు చేయగలిగితే కచ్చితంగా ఓవర్సేస్ లో కూడా అతనికి మార్కెట్ క్రియేట్ అవుతుంది.

కిరణ్ అబ్బవరం నెక్స్ట్ 'దిల్ రుబా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ మూవీ రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కింది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా పెద్ద ప్రొడక్షన్స్ లో 2, 3 సినిమాలు కిరణ్ అబ్బవరం లైన్ అప్ లో ఉన్నాయి.

నార్త్ అమెరికా - $656,031

గల్ఫ్ కంట్రీస్ - $23K

యూకే అండ్ ఐర్లాండ్ - $35K

ఆస్ట్రేలియా - $40.4K

రెస్ట్ ఆఫ్ వరల్డ్ - $20K అంచనా

టోటల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - $774K