Begin typing your search above and press return to search.

కిరణ్ అబ్బవరం ‘క’ - పండగ బ్లాస్ట్ కి సిద్ధం

టాలీవుడ్ లో భిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 7:50 AM GMT
కిరణ్ అబ్బవరం ‘క’ -  పండగ బ్లాస్ట్ కి సిద్ధం
X

టాలీవుడ్ లో భిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా కంటెంట్ ఉంటుందని చాలాసార్లు నిరిపించాడు. రాజా వారూ రాణి గారు, సమ్మోహనం లాంటి సినిమాలు అతనికి మంచి గుర్తింపునిచ్చాయి. ఇక ‘రూల్స్ రంజన్’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన కిరణ్ అబ్బవరం, తన కొత్త సినిమా ‘KA’తో తెలుగు చిత్రసీమలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నాడు.


ఈ యాక్షన్ పీరియడ్ డ్రామా రిలీజ్ డేట్ విషయంలో అనేక రకాల గాసిప్స్ వైరల్ అవ్వగా ఫైనల్ కూడా మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 31న, దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీపావళికి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘KA’లో కిరణ్ అబ్బవరానికి జోడీగా నయన్సారిక నటిస్తోంది.

ఇక ఈ సినిమా కథానాయకుడి పాత్రలో కిరణ్ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. సినిమా విడుదల డేట్ ను ప్రకటిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా అందులో కూడా కొత్తగా కనిపిస్తున్నాడు. ఒక కత్తి పట్టుకుని ఉన్న కిరణ్ చాలా ఇంటెన్స్‌గా, మాస్ అప్పీల్‌తో ఉన్నాడు. ఈ పోస్టర్ ద్వారా సినిమాలో ఉత్కంఠభరిత యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.

సినిమాకు సామ్ సి.ఎస్ సంగీతం అందించగా, విశ్వాస్ డేనియల్ మరియు సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. వీరి టెక్నికల్ వర్క్ సినిమాకు ఒక ప్రత్యేకమైన విజువల్ అనుభూతిని అందిస్తుందని టీజర్ చూపిస్తుంది. శ్రీ వరప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేశారు ఏదేమైనా ‘KA’ చిత్రంలో కిరణ్ అబ్బవరం కొత్త అవతారంలో కనిపించనున్నాడని ఒక క్లారిటీ వచ్చేసింది.

ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, కథ, సంగీతం – అన్నీ కిరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్‌లో కొత్త చాప్టర్ ఆరంభమవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా గట్టిగానే సెట్టయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనంత రేంజ్ లో కిరణ్ సినిమాకు బిజినెస్ జరిగింది.

ఈ దీపావళికి ప్రేక్షకులకు పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అందించడమే లక్ష్యంగా చిత్ర యూనిట్ పని చేస్తోంది. ప్రీ రిలీజ్ హైప్ చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం తన నటనతో మరింత ఆకట్టుకుని, కొత్త స్థాయికి చేరుకోవాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరి సినిమా ఆడియెన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.