పోటీ అవసరమా అన్నారు.. ఎవరు నమ్మలేదు: కిరణ్ అబ్బవరం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. "మా ‘క’ సినిమాను ఇంత పెద్ద విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
By: Tupaki Desk | 8 Nov 2024 1:58 PM GMTయంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ “క” విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా విజయం పట్ల నటీనటులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. ఇక సినిమాలో నటీనటులు కూడా పర్ఫెక్ట్ గా సెట్టయ్యారు. హీరోయిన్లుగా తన్వీరామ్, నయన్ సారిక నటించారు.
వైవిధ్యమైన కథ, వినూత్నమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల్ని బాగా ఆకర్షించిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. "మా ‘క’ సినిమాను ఇంత పెద్ద విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సినిమా విడుదలకు ముందు పెద్దగా ఎవ్వరు నమ్మకపోయినా, నిజమైన సపోర్ట్‌ను ప్రేక్షకులు అందించారు. వారి ప్రేమ, సపోర్ట్ మా విజయంలో కీలక పాత్ర పోషించాయి” అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అంటూ తన ఆత్మీయ భావనను పంచుకున్నారు. సినిమా విడుదలకు ముందే పెద్ద సినిమాల మధ్య ఈ చిత్రాన్ని విడుదల చేయడంపై కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. మా సినిమాను ఎవరూ నమ్మకపోయినా, మంచి సినిమా అని చెప్పినా నమ్మకం చూపలేదు. కానీ ప్రేక్షకులు మా మాటలను నిజం చేసి చూపారు.. అంటూ కిరణ్ అభిమానుల సహకారాన్ని ప్రశంసించారు.
ఇక ఈ సినిమా విజయం కేవలం నా కోసం కాదు, టీమ్ అందరికీ దక్కాల్సిన విజయం. సక్సెస్, ఫెయిల్యూర్స్ నా ఒంటికి పడతాయాని అనిపించదు. అందుకే, విజయాలు, వైఫల్యాలను ఒకేలా స్వీకరిస్తాను. నా కెరీర్లో విజయాలకంటే నా ప్రయాణమే ముఖ్యం. ఈ జర్నీనే నాకు సంతృప్తినిస్తుంది.. అని తన ప్రయాణం పట్ల తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరిచారు. అలాగే మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలి. ప్రతీ హీరోను అతని మార్కెట్ బట్టి మాత్రమే అంచనా వేయడం సరికాదు.
ఒక్క శుక్రవారం మాత్రమే చాలు, ఆ నెంబర్లు మారిపోవడానికి. ప్రేక్షకులు మా సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. వాళ్లందరిని వ్యక్తిగతంగా కలసి వారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తాను,” అంటూ తన అభిమానుల పట్ల తన ప్రేమను వ్యక్తం చేశారు. తన అభిమానుల ప్రోత్సాహంతో మరిన్ని మంచి సినిమాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మీ ప్రేమ, మీ ప్రోత్సాహంతో నేను మరిన్ని మంచి చిత్రాలు తీసుకురావాలని ఉత్సాహంగా ఉన్నాను. మీరు చూపిస్తున్న అభిమానం నాకు పెద్ద స్ఫూర్తి. ఈ సినిమా విజయంతో నాలో కొత్త విశ్వాసం కలిగింది,” అంటూ కిరణ్ తన ఆనందాన్ని పంచుకున్నారు.