యువ హీరో పొలిటికల్ డ్రీమ్స్..!
క తో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం తన నెక్స్ట్ సినిమా దిల్ రూబాతో రాబోతున్నాడు.
By: Tupaki Desk | 7 March 2025 10:02 PM ISTయువ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. మొన్నటిదాకా కాస్త ట్రాక్ తప్పినట్టుగా వెళ్తున్న అతని కెరీర్ లేటెస్ట్ గా వచ్చిన క సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. క సినిమాపై ముందు నుంచి భారీ హైప్ రాగా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. క తో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం తన నెక్స్ట్ సినిమా దిల్ రూబాతో రాబోతున్నాడు.
విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుంది. మార్చి 14 హోలీ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం తన పొలిటికల్ డ్రీమ్స్ గురించి చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి తనకు రాజకీయాలంటే ఇష్టమని అన్నారు కిరణ్ అబ్బవరం. తను కూడా ఎన్నో రాజకీయాలను చూశానని నటుడిని కాకపోతే కచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్లేవాడిని అని అన్నారు కిరణ్ అబ్బవరం. ప్రజలతో మమేకం అవ్వడం ఇష్టం అందుకే రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకున్నా అని అన్నారు కిరణ్ అబ్బవరం. రాయలసీమ చెందిన వ్యక్తిగా చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ చూశానని అన్నారు. అంతేకాదు ఫ్యూచర్ లో బిజినెస్ చేసే ఆలోచన కూడా ఉందని చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం.
ఫుడ్ బిజినెస్ పెట్టాలన్న ఆసక్తి ఉందని చెప్పిన కిరణ్ అబ్బవరం రాయలసీమ స్టైల్ ఫుడ్ అందించాలని ఉందని అన్నారు. దానికి కావాల్సిన పనులు జరుగుతున్నాయని అన్నారు కిరణ్ అబ్బవరం. జాబ్ చేస్తూ ఎప్పుడైతే యాక్టర్ అవ్వాలని అనుకున్నానో ఆ టైం లో జాబ్ మానేశా అప్పుడు చాలా బాధ పడ్డానని చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం.
ఇక పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉందని కూడా చెప్పారు. క తో సూపర్ సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం దిల్ రూబాతో ఆ సక్సెస్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
సో కిరణ్ అబ్బవరం ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి ఒక్క హీరో సినిమాలు చేస్తూ అలా వచ్చిన డబ్బుతో బిజినెస్ చేస్తున్నారు. కిరణ్ కూడా రాయలసీమ రుచులు చూపించేలా ఫుడ్ బిజినెస్ లో దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు.