శివరాత్రి వేడుకల్లో అబ్బవరం కపుల్.. పిక్స్ చూశారా?
అయితే తాజాగా కిరణ్, రహస్య శివరాత్రి పండుగను జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోయంబత్తూరులో ఉన్న ప్రముఖ ఈషా ఫౌండేషన్ కు వారిద్దరూ వెళ్లారు.
By: Tupaki Desk | 27 Feb 2025 7:22 AM GMTటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరఖ్ గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న వారిద్దరూ.. గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు త్వరలో తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు. ఆ విషయాన్ని రీసెంట్ గా కిరణ్ అబ్బవరం అనౌన్స్ చేశారు.

త్వరలోనే తాము పేరెంట్స్ కాబోతున్నట్లు తెలిపారు. గర్భంతో ఉన్న తన సతీమణి రహస్య గోరఖ్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగందంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చారు. అప్పట్లో ఆ పిక్ ఫుల్ వైరల్ గా మారగా.. అటు సెలబ్రిటీలు.. ఇటు అభిమానులు కంగ్రాట్స్ తెలిపారు.

అయితే తాజాగా కిరణ్, రహస్య శివరాత్రి పండుగను జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోయంబత్తూరులో ఉన్న ప్రముఖ ఈషా ఫౌండేషన్ కు వారిద్దరూ వెళ్లారు. పట్టు పంచెలో కిరణ్ ఉండగా.. ట్రెడిషనల్ శారీలో రహస్య గోరఖ్ మెరిసిపోతున్నారని చెప్పాలి. బేబీ బంప్ కూడా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్యూట్ కపుల్ ఫర్ ఎవర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సూపర్ పిక్స్ అని చెబుతున్నారు. పేరెంట్స్ టు బీ అంటూ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. అడ్వాన్స్ డ్ గా కంగ్రాట్స్ కూడా చెప్పేస్తున్నారు. అలా ప్రస్తుతం నెట్టింట కిరణ్, రహస్య పిక్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.
అయితే కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ రాజావారు రాణిగారు సినిమాలో కలిసి హీరో, హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీతోనే ఎంట్రీ ఇచ్చారు. మంచి హిట్ కూడా అందుకున్నారు. అంతకుముందు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేసిన వారు.. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఇక తమ మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. కానీ ఎక్కడా ఎవరికీ తెలియకుండా చూసుకున్నారు. సుమారు ఐదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత పెద్దల అనుమతితో గతేడాది ఏడాది ఆగస్టు 22న పెళ్లి చేసుకున్నారు. కర్ణాటకలోని కూర్గ్ లో కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వారి వివాహం జరిగింది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో పేరెంట్స్ గా ప్రమోషన్ అందుకోనున్నారు.