భార్యతో కలిసి మరో గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం.. వైరల్ ఫిక్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ హీరోగాగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో మరో మధురమైన ఘట్టంలోకి అడుగు పెట్టాడు.
By: Tupaki Desk | 21 Jan 2025 4:51 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ హీరోగాగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో మరో మధురమైన ఘట్టంలోకి అడుగు పెట్టాడు. తండ్రి కాబోతున్నట్లు తన భార్య రహస్య గోరఖ్ తో కలిసి ఫోటో షేర్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పాడు. "మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది" అంటూ సోషల్ మీడియాలో ఈ వార్తను పంచుకున్నారు కిరణ్, తన అభిమానులను, ఇండస్ట్రీలోని సహచరులను ఆనందంలో ముంచెత్తాడు.
రహస్య గోరఖ్, కిరణ్ అబ్బవరం తొలి సినిమా రాజావారు రాణిగారు లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ పరిచయం పెంచుకుని ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదు సంవత్సరాల ప్రేమానుబంధం తర్వాత, 2024ఆగస్టు 22న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లిని సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిపించినా, రిసెప్షన్ ను ఘనంగా నిర్వహించారు.
ఇటీవల క సినిమాతో తన కెరీర్ లో మంచి విజయాన్ని అందుకున్న కిరణ్, ఆ హిట్ తరువాత మరింత ఉత్సాహంగా తన ప్రాజెక్టులను కొనసాగిస్తున్నాడు. కిరణ్ తన భార్య రహస్యను తన లక్కీ చామ్ గా పేర్కొంటూ ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. రహస్య తన నటనా కెరీర్ ను పక్కన పెట్టి, ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతోంది.
తన గత చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న కిరణ్, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ తో వెనుకబడ్డాడు. కానీ, క సినిమా విజయంతో మళ్లీ టాప్ గేర్ లోకి వచ్చాడు. ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి, కిరణ్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. ఈ విజయం తరువాత కిరణ్ తన తర్వాతి సినిమా దిల్ రుబా ను ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు.
కిరణ్ అబ్బవరం ఈ గుడ్ న్యూస్ ను పంచుకోవడంతో పాటు తన భార్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. వారి అనుభవాలు, కొత్త జీవన ప్రయాణం మొదలవుతున్న సమయంలో అభిమానులు, నెటిజన్లు, పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తన వ్యక్తిగత జీవితంతో పాటు సినిమా కెరీర్ ను సమానంగా ముందుకు తీసుకెళ్తున్న కిరణ్ అబ్బవరం తన అభిమానులకు మరింత దగ్గరగా ఉన్నాడు. ఆ గుడ్ న్యూస్ తో కిరణ్ అభిమానుల హృదయాలలో మరింత ప్రత్యేక స్థానం సంపాదించాడు. కిరణ్ దంపతులకు ఈ కొత్త జీవన అధ్యాయంలో అద్భుతమైన ప్రయాణం కావాలని అభిమానుల ఆశీర్వాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.