Begin typing your search above and press return to search.

మాట నిలబెట్టుకున్న అబ్బవరం.. ఫ్రెండ్ కోసం ఇలా..

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లవ్ రెడ్డి మూవీ కోసం తాను కూడా హెల్ప్ చేస్తానని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షో స్పాన్సర్ చేస్తానని మాట ఇచ్చారు.

By:  Tupaki Desk   |   18 Oct 2024 12:45 PM GMT
మాట నిలబెట్టుకున్న అబ్బవరం.. ఫ్రెండ్ కోసం ఇలా..
X

"నా సినిమా రెండు రోజులు ఆగి చూసినా పర్వాలేదు. లవ్ రెడ్డి మూవీ మాత్రం వెంటనే చూసేయండి" అని రీసెంట్ గా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు ఎంతటి వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తన స్నేహితుడు అంజన్ రామచంద్ర లవ్ రెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఆయన ఆ కామెంట్స్ చేశారు. కంటెంట్ నచ్చితే లవ్ రెడ్డి సినిమాను హార్ట్‌ ఫుల్‌ గా సపోర్ట్ చేయండని కోరారు.

అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లవ్ రెడ్డి మూవీని కొత్త ద‌ర్శ‌కుడు స్మ‌ర‌న్ రెడ్డి తెరకెక్కించారు. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరీ స్టూడియో, ఎమ్జీఆర్ ఫిల్మ్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఆ సినిమా.. నేడు థియేటర్లో విడుదలైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఫీల్ గుడ్ ప్రేమ కథగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. సినిమా ఎమోషనల్ గా బాగుందని పలువురు నెటిజన్లు చెబుతున్నారు.

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లవ్ రెడ్డి మూవీ కోసం తాను కూడా హెల్ప్ చేస్తానని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షో స్పాన్సర్ చేస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు అదే మాటను నిలబెట్టుకున్నారు. వైజాగ్, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ లో నేడు నాలుగు స్పెషల్ షోలు వేశారు. ఫ్రీగా థియేటర్లకు వెళ్లి సినిమా చూసేలా ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్ లోని జీపీఆర్‌ మల్టీప్లెక్స్ లో నేడు సాయంత్రం 7.45 షో, వైజాగ్ శ్రీ రామ థియేటర్ లో 6.30 షో, తిరుపతి కృష్ణ తేజ థియేటర్ లో 6.30 షో, విజయవాడ స్వర్ణ మల్టీప్లెక్స్ లో 6.30 షోలను ప్రేక్షకుల కోసం ఉచితంగా ఏర్పాటు చేశారు కిరణ్ అబ్బవరం. దీంతో ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్న ఆయనపై సోష‌ల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కైండ్ హార్టెడ్ అంటూ కొనియాడుతున్నారు.

మరోవైపు, కిరణ్ అబ్బవరం తొలి పాన్ ఇండియా మూవీ 'క' త్వరలో విడుదల కానుంది. యాక్షన్, సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దీపావళి కానుకగా ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి 'క' చిత్రం.. ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.