సింపతీతో సినిమాలాడవ్ బాస్!
తాజాగా ఈ సింపతీ గురించి మరోసారి మాట్లాడారు. 'సింపతీ వల్ల సినిమాలు ఆడతాయి అనడంలో అర్దం లేదు. 'క' సినిమా అమ్మ కడుపు మీద చేసిన చిత్రం.
By: Tupaki Desk | 12 March 2025 6:48 PM ISTయంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం పుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమధ్య 'క'తో మంచి విజయం అందుకున్న తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. 'క' తక్కువ బడ్జెట్ లోనే చేసి భారీ లాభాలు రావడంతో? కిరణ్ అబ్బవరం మార్కెట్ రేంజ్ కూడా రెట్టింపు అయింది. దీంతో నవ నిర్మాతలకు కిరణ్ అందుబాటులో ఉంటున్నాడు...అతడి సింప్లిసిటీ నచ్చి కూడా అవకాశాలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
త్వరలో 'దిల్ రుబా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే 'క' సినిమా హిట్ అవ్వడానికి అతడిపై సింపతీ కూడా ఓ కారణం అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. రిలీజ్ కి ముందు ఇండస్ట్రీలో కొంత మంది తనని టార్గెట్ చేస్తున్నారని..సోషల్ మీడియాలో పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే అంశాలపై కిరణ్ మీడియా సమావేశంలో ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సింపతీ గురించి మరోసారి మాట్లాడారు. 'సింపతీ వల్ల సినిమాలు ఆడతాయి అనడంలో అర్దం లేదు. 'క' సినిమా అమ్మ కడుపు మీద చేసిన చిత్రం. ఆ నేపథ్యంలోనే నా కోసం మా అమ్మ పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటూ 'క' వేడుకలో భావోద్వేగానికి గురయ్యాను. కానీ దాన్ని కొందరు సింపతీ అన్నారు. నిజానికి చాలా మంది హీరోలు వాళ్ల నేపథ్యాలు..తల్లిదండ్రుల గురించి ఏదో సందర్భంలో చెబుతుంటారు.
అలా చెప్పడం తప్పేం కాదు. కానీ దీన్ని కొందరు సింపతీ కోణంలో చూస్తున్నారు. ఇది చూస్తుంటే భవిష్యత్ లో నా వాళ్ల గురించి ఏదైనా చెప్పాలంటే మాట్లాడలేనేమోని భయం వేస్తోంది. ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్లు. బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చూస్తున్నారు. 'క'లో అలాంటి కంటెంట్ ఉంది కాబట్టే చూసారు. సింపతీతో సినిమాలు ఆడతాయంటే ఓ పదిగంటలు మైక్ పట్టుకుని ఏడుస్తా. సింపతీతో సినిమాలాడవ్' అని అన్నారు.