Begin typing your search above and press return to search.

సినిమా మీటర్ అర్ధం చేసుకున్న యువ హీరో..!

ఇక నుంచి వచ్చే సినిమాలన్నిటినీ నేనే దగ్గర ఉండి సరిగా చూసుకుంటా ప్రేక్షకులను నిరాశ పరచనని అంటున్నారు కిరణ్ అబ్బవరం.

By:  Tupaki Desk   |   20 Oct 2024 5:43 AM GMT
సినిమా మీటర్ అర్ధం చేసుకున్న యువ హీరో..!
X

ఒక హిట్ పడగానే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారినైనా ఆకాశానికి ఎలా లేపుతారో.. వరుస ఫ్లాపులు వస్తుంటే ఎంత ఎత్తులో ఉన్న వారినైనా పాతాళానికి తొక్కేస్తారు. సినీ పరిశ్రమలో ఆ లెక్క ఎప్పుడు ఒకేలా ఉంటుంది. హిట్ ఉన్న వారికే అవకాశాలు రెమ్యునరేషన్ హైకులు, ఇంకా ఎక్కువ అవకాశాలు ఇలా వస్తాయి. ఒక్కసారి ఫ్లాప్ పడిందా మళ్లీ నిలబడేదాకా చాలా కష్టపడాల్సి వస్తుంది. యువ హీరోల్లో కొందరికి ఒకటి రెండు హిట్లు పడగానే వరుస అవకాశాలు వస్తుంటాయి. ఎలాగు వచ్చిన ఛాన్స్ ని వేస్ట్ చేయడం ఎందుకని సినిమాలు చేస్తారు వాటి ఫలితాలు తేడా కొట్టడంతో కెరీర్ లో వెనుకబడతారు.

దాదాపు యువ హీరో కిరణ్ అబ్బవరం పరిస్థితి కూడా అలానే సాగింది. తొలి సినిమా రాజా వారు రాణి గారు తో ఇంప్రెస్ చేసి ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం తో మెప్పించిన కిరణ్ అబ్బవరం తన స్లాంగ్ తన సింపుల్ క్యారెక్టర్ తో అదరగొట్టారు. ఐతే రెండు హిట్లు పడగానే అరడజను ఛాన్సులు వచ్చాయి. ఆ టైం లో కథల గురించి అంతగా పట్టించుకోకుండానే సినిమాలు చేశారు.

ఐతే ఆ తర్వాత తప్పు జరిగింది అని తెలుసుకున్నారు. తన ఫ్లాపుల గురించి కిరణ్ అబ్బవరం ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఏమి లేకుండానే షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఇక్కడదాకా వచ్చా మొదటి రెండు సినిమాలు సక్సెస్ అవ్వడంతో ఆఫర్లు వస్తున్నాయి కదా అని చేశా కానీ కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందే ఫలితాలు అర్థమయ్యాయి. ఇక్కడ రాజకీయం.. లౌక్యం తెలియాలని అన్నారు కిరణ్ అబ్బవరం.

అందుకే ఇక మీదట తను చేసే సినిమాల మీద పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా అని అన్నారు కిరణ్ అబ్బవరం. ఇక నుంచి వచ్చే సినిమాలన్నిటినీ నేనే దగ్గర ఉండి సరిగా చూసుకుంటా ప్రేక్షకులను నిరాశ పరచనని అంటున్నారు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం కిరణ్ 'క' సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో కిరణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్న క సినిమా టైం మిషన్ కాన్సెప్ట్ తో వస్తుందని టాక్. సినిమా పై బజ్ బాగానే ఉంది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.