వైరల్ వీడియో: నాలుగో భార్యతో నటుడి ఫోజ్‌లు
కబీర్ బేడీ వ్యక్తిగత జీవితం నిజానికి సినిమాని తలపిస్తుంది. అతడు పరమ రొటీన్ సామాజిక నిబంధనలను ధిక్కరించేందుకు వెనకాడడు.
By: Tupaki Desk | 14 March 2025 1:35 PM ISTబాలీవుడ్ సీనియర్ నటుడు కబీర్ బేడీ (79) తెలుగు ఆడియెన్ కి సుపరిచితుడు. నందమూరి బాలకృష్ణ తో గౌతమి పుత్ర శాతకర్ణి, పైసా వసూల్ లాంటి భారీ చిత్రాల్లో నటించాడు. సమంత `శాకుంతలం`లోను అతడు నటుడిగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ సహా సౌత్ లోను అవకాశాలు అందుకుంటున్నాడు. అయితే అతడి నటనా జీవితం కంటే వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చల్లో నిలుస్తుంది. అతడి జీవితం ఒక సినిమా కంటే ఏమాత్రం తక్కువ కాదు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఘనత అతడికే దక్కుతుంది.
కబీర్ బేడీ వ్యక్తిగత జీవితం నిజానికి సినిమాని తలపిస్తుంది. అతడు పరమ రొటీన్ సామాజిక నిబంధనలను ధిక్కరించేందుకు వెనకాడడు. ``రాముడు మంచి బాలుడు.. ఒకరికి ఒకరే భార్య!`` అనే నియమాలు అతడికి వర్తించవు. అందుకే అతడు విలన్ వేషాల్లోను రాణించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన భార్యలు పర్వీన్, ప్రోతిమ గురించి మాట్లాడాడు. ఎఫైర్లు, పెళ్లి గురించి వివరించాడు. నటి పర్వీన్ బాబీని తాను విడిచిపెట్టలేదని, కానీ తన మానసిక అనారోగ్యానికి చికిత్స చేయించుకోవాలని తనపై ఒత్తిడి తెస్తాననే భయంతో తనను విడిచిపెట్టిందని కబీర్ చెప్పాడు. ఈ సందర్భంలో కబీర్ బేడీ తన ఆత్మకథ ``స్టోరీస్ ఐ మస్ట్ టెల్: ది ఎమోషనల్ జర్నీ ఆఫ్ యాన్ యాక్టర్``లోని కొన్ని కథనాలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఈ పుస్తకంలో ఒడిస్సీ నర్తకి ప్రొతిమా బేడీతో తన వివాహం గురించి, పర్వీన్ బాబీతో తన ఎఫైర్ ను భార్య ప్రొతిమా ముందు ఎలా బయటపెట్టాడనే దాని గురించి ఆయన రాశారు.
ప్రోతిమా నుంచి విడిపోయాక, అతడు ఫర్వీన్ చెంతకు చేరుకున్నాడు. పర్వీన్ దుసాంజ్(49)తో తన వివాహానికి తన భార్య ఎలా స్పందించిందో కూడా కబీర్ బేడి స్పష్టంగా రాశారు. ``ఆమె ఘాఢంగా శ్వాస వదిలి నా వైపు చూసింది. నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా?`` అని ప్రశ్నించింది. నేను బాధ లేకుండా తల ఊపాను. ``ఆమె నిన్ను ప్రేమిస్తుందా?`` అని కూడా అడిగింది. తన గొంతు మరింత పైకి లేచింది. ``అవును... నేను ఏడవాలని`` అంటూ దురుసుగా అన్నాడు. ఆ తర్వాత ఆమెతో అల్లకల్లోల జీవితం గడిపానని తెలిపాడు.
కబీర్ బేడి నిజానికి నాలుగు సార్లు వివాహం చేసుకున్నాడు. ప్రోతిమా బేడి, సుసాన్ హంఫ్రీస్, నిక్కీ బేడిల నుంచి విడిపోయాడు. అతని ప్రస్తుత భార్య పర్వీన్ దుసాంజ్. పూర్తి వివరాల్లోకి వెళితే... కబీర్ బేడి మొదట 1969లో నర్తకి ప్రొతిమా బేడిని వివాహం చేసుకున్నారు. వారు 1977లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు పూజా బేడి - సిద్ధార్థ్ బేడి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆ తర్వాత అతను బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ సుసాన్ హంఫ్రీస్‌ను వివాహం చేసుకున్నాడు. వారి వివాహ బంధం బాధాకరమైన బ్రేకప్ తో కొంతకాలానికే ముగిసింది. అతడి మూడవ భార్య టీవీ రేడియో ప్రెజెంటర్ అయిన నిక్కీ బేడి. కానీ ఈ జంట కూడా 2005లో విడాకులు తీసుకున్నారు. తర్వాత పర్వీన్ దుసాంజ్‌ను కబీర్ 2016లో వివాహం చేసుకున్నాడు. ఆమె లండన్‌లో నివసిస్తున్న భారతీయ సామాజిక పరిశోధకురాలు.
కుర్బాన్, ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై, దిల్‌వాలే వంటి చిత్రాలలో తన నటనతో పాటు, కబీర్ బేడి ది ఆర్చర్: ఫ్యుజిటివ్ ఫ్రమ్ ది ఎంపైర్, లా టైగ్రే ఇ అంకోరా వివా: సాండోకన్ అల్లా రిస్కోసా! ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ వంటి అంతర్జాతీయ ప్రాజెక్టులలో కూడా కబీర్ బేడీ నటించారు.