Begin typing your search above and press return to search.

పెళ్లిపై అసలు క్లారిటీ ఇచ్చేసిన యువ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 July 2024 10:14 AM GMT
పెళ్లిపై అసలు క్లారిటీ ఇచ్చేసిన యువ హీరో
X

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా తన సినిమాలతో అలరిస్తున్నారు. రాజావారు రాణివారు సినిమాతో తెరంగేట్రం చేసిన కుర్ర హీరో.. డెబ్యూతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీతో కమర్షియల్ హిట్ సాధించారు. అలా వరుస చిత్రాలు చేస్తున్న ఆయన.. ఇప్పుడు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ మధ్య స్మాల్ గ్యాప్ తీసుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు మళ్లీ బిజీగా గడుపుతున్నారు. ప్ర‌స్తుతం క‌, దిల్‌ రూబా సినిమాల్లో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా క మేకర్స్.. టీజర్ ను రిలీజ్ చేశారు. మూవీలో కిరణ్ అబ్బవరం పోస్ట్ మ్యాన్ గా నటిస్తున్నట్లు చూపించారు. టీజర్ ద్వారా మూవీపై మంచి బజ్ కూడా క్రియేట్ చేశారు. అదే సమయంలో కిరణ్ అబ్బవరం మొదటి సినిమా హీరోయిన్.. అదేనండీ కాబోయే సతీమణి రహస్య గోరఖ్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది.

కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ రొమాంటిక్ వీడియో షేర్ చేసింది రహస్య. కిరణ్ ను భర్త అని పిలిచేందుకు ఆగలేకపోతున్నానని.. దానికి ఇంకో 38 రోజులే టైమ్ ఉందని పోస్ట్ పెట్టింది. అలా ఇన్ డైరెక్ట్ గా పెళ్లి డేట్ ను రివీల్ చేసింది. ఆమె పోస్ట్ ప్రకారం చూసుకుంటే.. రాజావారు రాణివారు రీల్ కపుల్ కిరణ్, రహస్య జంట.. ఆగస్టు 22వ తేదీన రియల్ కపుల్ గా మారనుందన్నమాట.

అయితే రహస్య షేర్ చేసిన రొమాంటిక్ వీడియో.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. వీడియో అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కిరణ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అవడంతో.. వివాహ బంధంలోకి అడుగుపెట్టబోయే కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ కు అడ్వాన్స్ గా మ్యారీడ్ లైఫ్ విషెస్ కూడా చెప్పేస్తున్నారు.

ఇక 2019లో వీరిద్దరికీ పరిచయం అయింది. రాజావారు రాణివారు సినిమా టైమ్ లో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ ఆ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. అయితే ఈ ఏడాది మార్చిలో తమ లవ్ మ్యాటర్ ను రివీల్ చేశారు. అనంతరం నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి అవ్వనున్నారు. అందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే అనౌన్స్ చేస్తారని సమాచారం. ఎనీ వే అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కిరణ్, రహస్య!