హీరోయిన్ తో కిరణ్ అబ్బవరం పెళ్లి.. అదిరిపోయేలా..
కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ రాజావారు రాణిగారు సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది.
By: Tupaki Desk | 23 Aug 2024 3:56 AM GMTటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ఆయన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ప్రేమించుకొని కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి పెళ్లి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలో ఓ ప్రైవేట్ రిసార్ట్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా వీరి పెళ్లి జరగడం విశేషం. వైభవంగా తెలుగు సంప్రదాయంలో వీరిద్దరి పెళ్లి జరిగినట్లు బయటకొచ్చిన ఫోటోల బట్టి తెలుస్తోంది.
కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ రాజావారు రాణిగారు సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. పదేళ్లుగా ప్రేమలో ఉన్న ఇద్దరు ఎప్పుడు అధికారికంగా రిలేషన్ లో ఉన్న విషయాన్ని బయటపెట్టలేదు. రహస్య గోరఖ్ రాజావారు రాణిగారు సినిమా తర్వాత పూర్తిగా నటనకి దూరమైంది. ఈ ఏడాది ఆరంభంలో నిశ్చితార్ధంతో వీరిద్దరూ ప్రేమించుకున్న విషయం అధికారికంగా అందరికి తెలిసిందే.
తాజాగా పెళ్లితో ఇద్దరు ఒకటయ్యారు. హిందు సంప్రదాయం ప్రకారం అదిరిపోయే సౌండ్ తో వివాహ వేడుక జరిగింది. పెళ్లి కూతుర్ని పల్లకిలో తీసుకొని రాగా తీన్ మార్ బీట్ తో పెళ్లి కొడుకు ఎంట్రీ ఇచ్చాడు. స్నేహితులు బంధువులు ఈ జంట ముందు డ్యాన్స్ లతో చేసిన హడావుడి హైలెట్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియోలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం “క” అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో టైం ట్రావెల్ మూవీగా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. 20 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నారు.
కెరియర్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని కిరణ్ అబ్బవరం 10 ఏళ్ళు వెయిట్ చేశారు. ఇప్పుడు హీరోగా ఒక మంచి పొజిషన్ లో ఉండటంతో ప్రేమించిన అమ్మాయితో పెళ్లి పీటలు ఎక్కారు. వీరిద్దరి జంట చాలా బాగుందనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. రహస్య గోరఖ్ ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నుంచి రాబోయే సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రొడక్షన్ బాధ్యతలని రహస్య గోరఖ్ చూసుకుంటుంది.