Begin typing your search above and press return to search.

డెస్టినేషన్ వెడ్డింగ్… అక్కడ ప్లాన్ చేసిన కిరణ్ అబ్బవరం

ఈ మధ్యకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది అందరి అభిరుచిగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   30 July 2024 10:15 AM GMT
డెస్టినేషన్ వెడ్డింగ్… అక్కడ ప్లాన్ చేసిన కిరణ్ అబ్బవరం
X

ఈ మధ్యకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది అందరి అభిరుచిగా మారిపోయింది. ముఖ్యంగా సెలబ్రెటీలు వారి ఆర్ధిక సామర్ధ్యం బట్టి ఇండియాలో కొన్ని ప్రాంతాలని ఎంపిక చేసుకుంటూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. కొంతమంది విదేశాలలో వారికి ఇష్టమైన ప్రదేశాలలో గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసుకొని ఒకటవుతున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.

కిరణ్ అబ్బవరం మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ తో చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఫైనల్ గా పెద్దలని ఒప్పించి వీరిద్దరూ భార్యాభర్తల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆగష్టు 22న వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరు తమ పెళ్లిని కేరళలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యలోనే ఈ పెళ్లి వేడుక కేరళలో జరగబోతోందంట.

ఇప్పటికే వెన్యూ కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రాజావారు రాణిగారు సినిమాలో రహస్య గోరఖ్, కిరణ్ అబ్బవరం జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. అయితే కెరియర్ లో సక్సెస్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి వారి ప్రేమని సీక్రెట్ గా ఉంచారు. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.

దీంతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. ఎంగేజ్మెంట్ ద్వారా వీరి ప్రేమని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్తున్నట్లు రివీల్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం “క” అనే మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రెడీ అవుతోంది. మూవీపైన కిరణ్ అబ్బవరం చాలా హోప్స్ పెట్టుకున్నారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ తోనే “క” మూవీ బిజినెస్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ తీసుకోవడం లేదంట. లాభాలలో వాటా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మూవీకి నిర్మాణ భాగస్వామిగా కిరణ్ ఉన్నారు. ఈ ఏడాదిలోనే “క” మూవీ రిలీజ్ కాబోతోంది. పెళ్లి తర్వాత ఈ సినిమా రిలీజ్ పైన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందంట. “క” మూవీ రిలీజ్ తర్వాత దిల్ రుబా సినిమాని కిరణ్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్.