Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : రాజావారు పెళ్లికొడుకు ఆయేను..!

తన మొదటి సినిమా రాజా వారు రాణి గారు హీరోయిన్‌ రహస్య గోరక్‌ తో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు.

By:  Tupaki Desk   |   21 Aug 2024 5:34 AM GMT
పిక్ టాక్ : రాజావారు పెళ్లికొడుకు ఆయేను..!
X

రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం ఏమాత్రం బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండానే ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకున్నాడు. యూట్యూబ్‌ ద్వారా కెరీర్‌ ను ఆరంభించిన కిరణ్ అబ్బవరం అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తక్కువ సమయంలోనే నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న కిరణ్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న కిరణ్ అబ్బవరం తన పెళ్లి తో వార్తల్లో నిలిచాడు.

తన మొదటి సినిమా రాజా వారు రాణి గారు హీరోయిన్‌ రహస్య గోరక్‌ తో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది ఆరంభంలోనే రివీల్‌ చేశాడు. ఆ మధ్య కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరిగింది. ఆగస్టు 22న పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లి తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో హడావిడి షురూ అయ్యింది. కిరణ్ అబ్బవరం ను పెళ్లి కొడుకు ను చేసే కార్యక్రమం ముందు రోజే పూర్తి అయ్యింది. పెళ్లి కొడుకు గా రాజా వారు కిరణ్ అబ్బవరం లుక్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పెళ్లి కూతురు రహస్య గోరక్‌ లుక్ కోసం సోషల్‌ మీడియాలో నెటిజన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కిరణ్ అబ్బవరం పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలతో రాబోయే రెండు మూడు రోజులు సోషల్‌ మీడియా మొత్తం వైరల్‌ అవ్వబోతున్నాయి. పెళ్లి కొడుకుగా కిరణ్ అబ్బవరం లుక్‌ స్వీట్ అండ్ సింపుల్ గా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తూ పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కిరణ్ అబ్బవరం, రహస్యల వివాహం కూర్గ్ లో జరుగనుంది. రహస్య కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రులు అంతా కూడా అక్కడే ఉండటం వల్ల పెళ్లి కి అక్కడ వేదిక ఖరారు చేయడం జరిగిందట.

కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే గత సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్‌, రూల్స్ రంజన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మినిమం గ్యారెంటీ హీరో అనే ట్యాగ్‌ ను సొంతం చేసుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం 'క' అనే విభిన్నమైన సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను స్వయంగా కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నాడు. సుజీత్‌, సందీప్ లు సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్ కి మంచి స్పందన వచ్చింది.