Begin typing your search above and press return to search.

కిరణ్ అబ్బవరం 'క'.. ఏదో కొత్తగా ఉందే!

రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆయన.. మంచి గుర్తింపు సంపాదించుకున్నారు

By:  Tupaki Desk   |   10 July 2024 9:37 AM GMT
కిరణ్ అబ్బవరం క.. ఏదో కొత్తగా ఉందే!
X

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి అందరికీ తెలిసిందే. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆయన.. మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. స్పెషల్ క్రేజ్ కూడా దక్కించుకున్నారు. అయితే కిరణ్ అబ్బవరం సరైన హిట్ సాధించి చాలా నెలలు అవుతోంది. అనుకున్న స్థాయిలో ఆయన చేస్తున్న సినిమాలేవీ మెప్పించడం లేదు. ఇటీవల వివాహం చేసుకుని మూవీస్ కు చిన్న గ్యాప్ ఇచ్చారు యంగ్ హీరో.

రీసెంట్ గా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు కిరణ్ అబ్బవరం. 'క' అనే ఒకే ఒక్క అక్షరాన్ని టైటిల్ గా పెట్టినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. దాంతోపాటు స్పెషల్ ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఆ పోస్టర్ ను చూస్తుంటే సినిమా పీరియాడికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఈజీగా అర్థమవుతుంది. పోస్టర్ లో కిరణ్ ఫేస్ చూపించలేదు మేకర్స్. ఆయన వెనక్కి తిరిగి నిలుచునట్లు చూపించారు.

ఫుల్ హెయిర్ తో కిరణ్ అబ్బవరం కనిపిస్తున్నారు. టైటిల్ వెనుక అన్ని రాశుల గుర్తులు ఉన్నాయి. దాని కింద క అక్షరాన్ని హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో చూపించారు. అంటే ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో తెరకెక్కనున్నట్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మొత్తానికి ఈ మూవీతో కిరణ్ అబ్బవరం కూడా పాన్ ఇండియా హీరోగా మారనున్నారు. క సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణారెడ్డి భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొత్త డైరెక్టర్లు సుజిత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా సుధీర్ మాచర్ల పనిచేస్తున్నారు. అలా.. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించినట్లు సమాచారం.

అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందట. 2018 ఫేమ్ తన్వి రామ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. మరి ఈ మూవీతో కిరణ్ అబ్బవరం ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.