Begin typing your search above and press return to search.

“క” మూవీ.. బెస్ట్ థీయాట్రికల్ డీల్

ఇదిలా ఉంటే ఈ మూవీ టీజర్ తోనే పబ్లిక్ లో అటెన్షన్ క్రియేట్ చేశారు. మూవీలో ఏదో విషయం ఉందని అర్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   25 July 2024 7:56 AM GMT
“క” మూవీ.. బెస్ట్ థీయాట్రికల్ డీల్
X

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొంత గ్యాప్ తీసుకొని ఈ సారి పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ కొట్టడానికి “క” అనే మూవీతో రావడానికి రెడీ అవుతున్నాడు. పీరియాడికల్ జోనర్ లో డిఫరెంట్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. సుజిత్, సందీప్ ఈ చిత్రంతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం పోస్ట్ మెన్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో “క” మూవీ కథ ఉండబోతోందని తాజాగా వచ్చిన టీజర్ తో స్పష్టం అవుతోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ టీజర్ తోనే పబ్లిక్ లో అటెన్షన్ క్రియేట్ చేశారు. మూవీలో ఏదో విషయం ఉందని అర్ధమవుతోంది. కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ కూడా చాలా మిస్టీరియస్ గా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఒక్క టీజర్ తోనే మూవీ బిజినెస్ డీల్స్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయిపోయినట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాననే నమ్మకంతో కిరణ్ అబ్బవరం ఉన్నారు.

ఈ మూవీ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థీయాట్రికల్ రైట్స్ ని వంశీ నందపాటి సొంతం చేసుకున్నారు. పొలిమేర 3 చిత్రంతో ఈయన నిర్మాతగా మారబోతున్నారు. ఇక “క” మూవీ హక్కులని రెండు రాష్ట్రాలకి కలిపి 12 కోట్లకి వంశీ నందపాటి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే కిరణ్ అబ్బవరం మార్కెట్ తో పోల్చుకుంటే ఎక్కువ మొత్తానికే “క” మూవీ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, కెఏ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.కిరణ్ అబ్బవరం మూవీతో నిర్మాతగా మారబోతున్నాడు. ఈ సినిమాకి సామ్ సిఎస్ సంగీతం అందించారు. కంప్లీట్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉంటుందని తెలుస్తోంది. కచ్చితంగా “క” సినిమా కిరణ్ అబ్బవరం కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే అర్ధమవుతోంది.

ఈ ఏడాదిలోనే మూవీ ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రిలీజ్ డేట్ ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారు అనేది వేచి చూడాలి. నాన్ థీయాట్రికల్ రైట్స్ కూడా ఫ్యాన్సీ ధరకి అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. యూనివర్సల్ గా ఇలాంటి మిస్టీరియస్ థ్రిల్లర్ కథలకి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కిరణ్ కూడా పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.