Begin typing your search above and press return to search.

కిరణ్ అబ్బవరం ఫస్ట్ పాన్ ఇండియా.. 'క' టీజర్ ఇంట్రెస్టింగ్!

యాక్షన్ సీక్వెన్స్, జాతర, తోలుబొమ్మలాట వంటివి గ్లింప్స్ లో చూపించారు మేకర్స్.

By:  Tupaki Desk   |   15 July 2024 5:52 AM GMT
కిరణ్ అబ్బవరం ఫస్ట్ పాన్ ఇండియా.. క టీజర్ ఇంట్రెస్టింగ్!
X

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రాజావారు రాణివారు, ఎస్ ఆర్‌ కళ్యాణమండపం సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్‌ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని నెలలుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన.. ఇప్పుడు తొలి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. వివాహం జరిగాక కొంచెం గ్యాప్ తీసుకుని.. మళ్లీ ఇప్పుడు 'క' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు టాలెంటెడ్ నటుడు కిరణ్ అబ్బవరం.

1970 బ్యాక్ డ్రాప్ లో ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్లు సుజిత్‌, సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ ప్రీ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మూవీని రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 12 రాశుల సింబల్స్ ఉన్న ప్రత్యేక మిషన్.. చక్రంలా తిరుగుతున్న సీన్ తో టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఎవరు నువ్వు.. ఎక్కడి నుంచి వచ్చావ్.. పక్క వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఏంటి? నీకంటూ ఎవరూ లేరా.. అంటూ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ తో ఇంట్రెస్టింగ్ గా మారింది. నాకు తెలిసి నేను మంచి.. నాకు తెలియని నేను.. అంటూ హీరో డైలాగ్ తో టీజర్ ఒక్కసారి వేరే ట్రాన్స్ లోకి తీసుకెళ్లింది.

యాక్షన్ సీక్వెన్స్, జాతర, తోలుబొమ్మలాట వంటివి గ్లింప్స్ లో చూపించారు మేకర్స్. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం లుక్ ను రివీల్ చేశారు. అందులో వేరే లెవల్ లో ఉన్నారాయన. అనంతరం సాఫ్ట్ లుక్ లోకి వచ్చారు. మొత్తానికి టీజర్ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఆస్తకి రేపుతోంది. సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. టీజర్ లో కిరణ్ అబ్బవరం.. ఊర మాస్ లుక్ అదిరిపోయింది. సినిమాలో ఆయన యాక్షన్ కూడా అదరగొట్టేసినట్లు కనిపిస్తోంది.

వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్‌ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై సినిమాను చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఖైదీ, సర్దార్ లాంటి చిత్రాలకు వర్క్ చేసిన టాలెంటెడ్ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. విశ్వాస్ డేనియల్, సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రాఫర్లుగా, శ్రీ వరప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.