Begin typing your search above and press return to search.

జంటగా విడిపోయాం.. కుటుంబంగా కలిసున్నాం..!

అయితే వీరిద్దరు కూడా 2022 లో విడాకులు తీసుకున్నారు. అయితే జంటగా విడిపోయినా కుటుంబంగా కలిసే ఉన్నామని అంటున్నారు కిరణ్ రావు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 11:52 AM GMT
జంటగా విడిపోయాం.. కుటుంబంగా కలిసున్నాం..!
X

బాలీవుడ్ స్టార్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ లాస్ట్ ఇయర్ అతని వైఫ్ కిరణ్ రావు నుంచి డైవర్స్ తీసుకున్నారు. 2005 లో కిరణ్ రావుని పెళ్లాడిన అమీర్ ఖాన్ 2011లో వారికి ఒక బాబు పుట్టాడు. అయితే లాస్ట్ ఇయర్ కిరణ్ రావుకి డైవర్స్ ఇచ్చిన అమీర్ ఖాన్ ఇప్పుడు వేరే నటితో రిలేషన్ లో ఉన్నాడని చెప్పుకుంటున్నారు.

ఆమె ఖాన్ ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య రీనా దత్ నుంచి విడిపోయిన తర్వాత కిరణ్ రావు ని పెళ్లి చేసుకున్నారు. అమీర్ ఖాన్ నటించిన చాలా సినిమాలకు కిరణ్ రావు నిర్మాతగా బాధ్యతలు వ్యవహరించారు. అయితే వీరిద్దరు కూడా 2022 లో విడాకులు తీసుకున్నారు. అయితే జంటగా విడిపోయినా కుటుంబంగా కలిసే ఉన్నామని అంటున్నారు కిరణ్ రావు.

అమీర్ ఖాన్ భార్యలతో విడిపోయినా సరే కుటుంబాలు రెండు కలిసి ఉంటాయని తెలుస్తుంది. అమీర్ రెండు కుటుంబాలు ఒకే హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నాయి. రీసెంట్ ఇంటర్వ్యూలో కిరణ్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు. అమీర్ ఖాన్ తో అతని మొదటి భార్యతో ఉన్న రిలేషన్ గురించి ఆమె మాట్లాడారు. విడాకులు తీసుకుంటే కుటుంబం విడిపోతుందని కాదు. అమీర్ కూతురు ఐరా పెళ్లికి మా ఫ్యామిలీలో అందరు అటెండ్ అయ్యాం.

ఖాన్ కుటుంబం అంతా ఒక్కటే.. మేమంతా కూడా ప్రతి సోమవారం కలుస్తాం. మేము చాలా విషయాలను మాట్లాడుకుంటామని అన్నారు.. అందరం కలిసి కూర్చుకుని ఎక్కువ టైం స్పెండ్ చేస్తామని కిరణ్ రావు అన్నారు. అమీర్ మొదటి భార్య రీనా దత్తా కు తనకు మంచి అనుబంధం ఉందని ఆమె అన్నారు. ఐరీ, జునైద్ లతో కూడా తనకు మంచి రిలేషన్ ఉందని అన్నారు కిరణ్ రావు. మేమంతా కూడా ఒకే హౌసింగ్ సొసైటీలో ఉంటున్నామని అన్నారు. డైవర్స్ తీసుకుంటే సంబంధం తెగిపోయిందని కాదు.. అమీర్ తో విడాకులు తీసుకున్నా మా కుటుంబం విడిపోలేదని కిరణ్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు స్పెషల్ న్యూస్ గా మారాయి.

అమీర్ ఖాన్ ఇప్పుడు సినిమాల పరంగా కాస్త గ్యాప్ తీసుకున్నా త్వరలోనే ఒక భారీ అనౌన్స్ మెంట్ తో రాబోతున్నారని తెలుస్తుంది. అయితే అమీర్ ఖాన్ ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో కూడా వరుస సినిమాలు చేయాలని చూస్తున్నారు.