స్టార్ హీరో విడాకులకు ఆమె కారణం కాదట!
అమీర్‌తో ఆమె శృంగార సంబంధం వల్లనే రీనాతో విడాకులకు దారి తీసిందని చాలా మంది నమ్ముతారు. ఇది నిజమేనా? అంటే దానికి ఇప్పుడు కిరణ్ రావు ఏమన్నారంటే?
By: Tupaki Desk | 13 March 2024 11:30 AM GMTప్రముఖ హీరో తన లేడీ అసిస్టెంట్ డైరెక్టర్, తన సినిమాల కథానాయికలతో డేటింగులు చేసాడు. అతడి ఎఫైర్లు ఫ్యామిలీ బ్రేకప్ లకు కారణమయ్యాయని పుకార్లు ఉన్నాయి. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ తో ఎఫైర్ వల్ల భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత ఈమెకు కూడా విడాకులివ్వడానికి ఒక నటితో ఎఫైర్ కారణం. ఇద్దరికి విడాకులిచ్చి ఇప్పుడు అతడు నటితో సహజీవనం సాగిస్తున్నాడన్న చర్చ సాగింది. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడా నెలకొంది. ఈ ఎపిసోడ్ లో స్టార్ ఎవరో సులువుగానే ఊహించవచ్చు. అతడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.
అమీర్ ఖాన్ తన అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావుతో డేటింగ్ ప్రారంభించే ముందు, అతను రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. లగాన్ విడుదలైన ఒక సంవత్సరం తర్వాత 2002లో అమీర్ - రీనా వారి వివాహబంధానికి ముగింపు పలికారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కిరణ్ లగాన్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇది రీనాతో విడాకులకు దారితీసిందని మీడియాలో కథనాలొచ్చాయి. అమీర్‌తో ఆమె శృంగార సంబంధం వల్లనే రీనాతో విడాకులకు దారి తీసిందని చాలా మంది నమ్ముతారు. ఇది నిజమేనా? అంటే దానికి ఇప్పుడు కిరణ్ రావు ఏమన్నారంటే?
'లగాన్' షూటింగ్ సమయంలో తాను అమీర్‌తో మాట్లాడలేదని ఇటీవలి ఇంటర్వ్యూలో కిరణ్ వెల్లడించారు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మూడు సంవత్సరాల తర్వాత ఒకరితో ఒకరు సన్నిహితులమయ్యామని తెలిపారు. 2004లో తమ మధ్య స్నేహం ప్రారంభమైందని కిరణ్ స్పష్టం చేసారు. అంటే అమీర్ ఖాన్ విడాకులిచ్చిన రెండేళ్లకు ఇది జరిగిందనేది తన వివరణ.
అమీర్ - నేను లగాన్ సమయంలో కనెక్ట్ అయ్యామని చాలా మంది అనుకుంటారు. మేం కచ్చితంగా అలా చేయలేదు. స్వదేశ్ సమయంలో అమీర్ - నేను కలిసిపోయాము. అతడు ఆ సమయంలో మంగళ్‌పాండే షూటింగ్‌కి వెళ్తున్నాడు. మేము కోక్ కోసం అశుతోష్ గోవారికర్‌తో కొన్ని వాణిజ్య ప్రకటనల షూటింగులో పాల్గొన్నాం. అక్కడే అమీర్ నేను మళ్లీ కనెక్ట్ అయ్యాము. లగాన్ తర్వాత 3-4 సంవత్సరాలు పట్టింది. నేను అతడితో టచ్‌లో లేను. నిజానికి లగాన్ సమయంలో నేను అతనితో మాట్లాడలేదు. లగాన్ సమయంలో నేను మరొకరి వైపు ఆలోచిస్తున్నాను. 2004లో అమీర్ నేను కలిసి బయటకు వెళ్లడం ప్రారంభించినప్పుడు మేము లగాన్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది ప్రారంభమైందని అందరూ అనుకున్నారు. ఇది విడాకులకు కారణమైందని ప్రచారమైంది.. కానీ అవేవీ నిజాలు కావు అని కిరణ్ ఇటీవల జాతీయ మీడియాతో అన్నారు.
ఒకరితో బంధంలో ఉన్నప్పుడు వేరొకరితో అనుబంధం మంచిది కాదు. అది మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. నేను జంట కౌన్సెలింగ్‌ని గట్టిగా సిఫార్సు చేస్తున్నాను. అమీర్, నేను జంటలకు కౌన్సెలింగ్ చేసాము.. అని కూడా కిరణ్ రావు అన్నారు. ఏది ఏమైనప్పటికీ మేమిద్దరం ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండాలని అమీర్ నేను అంగీకరించడానికి ఇది సహాయపడింది అని తెలిపారు.
అమీర్ ఖాన్ - కిరణ్ రావ్ 2005లో వివాహం చేసుకున్నారు. అయితే వారు 2021లో విడిపోయారు. అయినప్పటికీ వారు ఇప్పటికీ స్నేహితులుగా ఉన్నారు. సహృదయంతో కొనసాగుతున్నారు. ఇటీవల లాపాటా లేడీస్‌ను సహ-నిర్మించారు.