Begin typing your search above and press return to search.

ఏడాది స‌హ‌జీవనం..పెద్ద‌ల కోస‌మే ఆ పెళ్లి!

అమీర్ ఖాన్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే పెళ్లి చేసుకోవ‌డం అన్న‌ది కిర‌ణ్ రావ్ కి ఇష్టం లేదు అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   24 May 2024 1:30 AM GMT
ఏడాది స‌హ‌జీవనం..పెద్ద‌ల కోస‌మే ఆ పెళ్లి!
X

ప్రేమల‌న్నీ పెళ్లి వ‌ర‌కూ దారితీయ‌వు. మ‌ధ్య‌లోనే కొన్ని బంధాలు వీగిపోతుంటాయి. వివాహం త‌ర్వాత క‌లిసి ఉన్న‌వారు ఉన్నారు. విడిపోయిన వారు ఉన్నారు. అందుకు ర‌క‌ర‌కాల కార‌ణాలుంటాయి. అలాంటి క‌థ‌లు...బంధాలు ఎన్నో ఉన్నాయి. బాలీవుడ్ జోడీ అమీర్ ఖాన్-కిర‌ణ్ రావ్ ల ప్రేమ వివాహం..విడిపోవ‌డం తెలిసిందే. అమీర్ ఖాన్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే పెళ్లి చేసుకోవ‌డం అన్న‌ది కిర‌ణ్ రావ్ కి ఇష్టం లేదు అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమె రివీల్ చేసారు. 'నిజాయితీగా చెబుతున్నా నేను-అమీర్ క‌లిసి ఏడాది పాటు స‌హ‌జీవ‌నం చేసాం. త‌ల్లిదండ్రుల బ‌ల‌వంతం వ‌ల్లే పెళ్లి చేసుకున్నాం. లేక‌పోతే చేసుకునే వాళ్లం కాదు. పెళ్లి అనే ఇనిస్ట్యూట్ లో భార్యాభ‌ర్త‌లుగా, విడివిడిగానూ ప‌నిచేస్తే అది బాగా వ‌ర్కౌట్ అవుతుంది. కానీ పెళ్లి అనేది అమ్మాయిల్ని అణిచివేస్తుంద‌ని నేను భావిస్తున్నాను. అమెరిక‌న్ సైకాల‌జిస్ట్ ఎస్త‌ర్ పెర‌ల్ దీని గురించి మంచి పుస్త‌కం రాసారు.

మ‌నం కోతులుగా జీవిస్తున్న‌ప్పుడు క‌లుస్తున్నాం. త‌ర్వాత కాల‌క్ర‌మేణా మాన‌వులు కుటుంబ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లి వ‌ల్ల మ‌హిళ‌ల‌పై ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబాన్ని చూసుకోవాలి. అంద‌రూ క‌లిసి ఉండాలి. అత్త‌మామ‌లు, ఆడ‌ప‌డుచులు ఇలా భ‌ర్త వైపు నుంచి అంద‌ర్నీ చూసుకోవాలి. ఇలా పెళ్లైన ఓమ‌హిళ ద‌గ్గ‌ర నుంచి ర‌క‌ర‌కాల అంశాలు ఆశిస్తున్నారు. ఇలాంటి వాటితో నేను ఏకీభ‌వించ‌లేను` అన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

అమీర్ ఖాన్-కిర‌ణ్ రావు విడిపోవ‌డానికి ఇలాంటి అంశాలే కార‌ణ‌మ‌య్యాయా? అంటూ ఓ నెటి జ‌నుడు ప్ర‌శ్నించాడు. మ‌రి దీనికి కిర‌ణ్ రావు రిప్లై ఉంటుందేమో చూడాలి. `ల‌గాన్` సినిమా టైమ్ లో అమీర్ -కిర‌ణ్ రావు ప్రేమ‌లో ప‌డ్డారు. అందులో అమీర్ హీరో అయితే...కిర‌ణ్ రావ్ ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసారు. 2004 లో డేటింగ్ చేయ‌గా 2005 లో వివాహం చేసుకుని 2021లో విడిపోయారు. స‌రోగ‌సీ ద్వారా ఆజాద్ కి త‌ల్లిదండ్రుల‌య్యారు.