ఐదేళ్లలో ఎన్నోసార్లు అబార్షన్!
బాలీవుడ్ స్టార్ కపుల్స్ అమీర్ ఖాన్-కిరణర్ రావు దంపతులు కొన్నాళ్ల క్రితం విడాకులతో వేరైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 April 2024 5:31 AM GMTబాలీవుడ్ స్టార్ కపుల్స్ అమీర్ ఖాన్-కిరణర్ రావు దంపతులు కొన్నాళ్ల క్రితం విడాకులతో వేరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు ఎవరి స్వేచ్ఛతో వారు జీవిస్తున్నారు. భార్యభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా మాత్రం కలుస్తూనే ఉన్నారు. ఈ దంపతులకు ఆజాద్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అజాద్ కి తల్లిదండ్రుల ప్రేమ యధావిధిగా దక్కుతుంది. అయితే తాజాగా ఓ సమావేశంలో కిరణ్ రావు తల్లి అవ్వడం అన్నది ఎంత కష్టమైనదో చెప్పే ప్రయత్నం చేసారు.
పెళ్లైన ఐదేళ్లలో ఎన్నోసార్లు గర్బస్రావం అయినట్లు తెలిపారు. పిల్లలు కలగాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా గర్బం నిలిచేది కాదని ఆ కారణంగా ఎంతగా ఇబ్బంది పడాల్సి వచ్చిందో గుర్తు చేసుకున్నారు. `పిల్లల కోసం ఎంతో ప్రయత్నించా. కానీ అబార్షన్ కావడం వల్ల శారీరకంగా..మానసికంగా ఎంతో దెబ్బ తిన్నాను. పిల్లల్ని పొందడం ఇంత కష్టమా? అని అప్పుడే అనిపించింది. ప్రపంచంలో ప్రతీ తల్లి ఎంతో గొప్పది. తొమ్మిది నెలలు మోసి పిల్లల్ని కనే విధానంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి ఆ బిడ్డ కోసం తల్లి అన్నింటిని భరిస్తుంది.
తన ప్రాణానే తృణ ప్రాయంగా పెడుతుంది. అది కేవలం తల్లికి మాత్రమే సాధ్యమైన పని` అని అన్నారు. కిరణ్ రావు ఐవీఎఫ్ సరోగసి పద్దతి ద్వారా పిల్లల్ని కన్నారు. గర్బస్రావం కావడంతో డాక్టర్ల సూచనలు..సలహా మేరకు సరోగసి పద్దతికి వెళ్లారు. అలా జన్మించిన బిడ్డనే ఆజాద్. ఆజాద్ అంటే తల్లిదండ్రులకు ఎంతో ఇష్టం. అమీర్ ఖాళీ సమయం దొరికితే కుమారుడితోనే సమయం గడుపుతాడు. అయితే విడిపోయిన తర్వాత అజాద్ తల్లి వద్దనే ఉంటున్నాడు. అయినా అప్పుడప్పుడు కలుస్తుంటారు.
ఇక మాజీ భార్యభర్తలిద్దరు వృత్తి పరంగా ఎంతో బిజీ. అమీర్ ఖాన్ చివరి సినిమా `లాల్ సింగ్ చద్దా` భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. దీంతో తదుపరి హిట్ కంటెంట్ తోనే రావాలని కసరత్తులు చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇక కిరణ్ రావు ధోబీ ఘాట్ తర్వాత దర్శకత్వం వహించిన `లా పట్టా లేడీస్` ఇటీవలే రిలీజ్ అయింది.