చినిగిన బట్టలతో ప్రియుడు.. నా జీవితం మరోలా!
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి..ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.
By: Tupaki Desk | 14 March 2024 5:30 PM GMTహాట్ బ్యూటీ కిరణ్ రాథోడ్ గురించి పరిచయం అవసరం లేదు. 'అందరూ దొంగలే దొరికితే'.. 'భాగ్యలక్ష్మి బంపర్‌డ్రాస'.. 'హై స్కూల్'.. 'కెవ్వు కేక' లాంటి చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలతో అమ్మడికి హాట్ బ్యూటీ అనే ట్యాగ్ ని అంకితం చేసారు. అటుపై మరికొన్ని సినిమాల్లోనూ నటించిన నటిగా తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఆనీ అమ్మడి కెరీర్ మాత్రం ఆశించిన విధంగా సాగలేదు. ట్యాలెంటెడ్ నటి అయినా అవకాశాలు అందుకోవడంలో ఎందుకనో వెనుకబడింది.
అటుపై మళ్లీ కొన్నాళ్లకు బిగ్ బాస్ షో ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఇండస్ట్రీలోకి సాలిడ్ రీ ఎంట్రీ ఇవ్వాలని భావించింది. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి..ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో అదే సమయంలో ప్రియుడు చెప్పిన మాటలు విని సినిమాలకు మరింత దూరం కావాల్సి వచ్చిందని తెలిపింది.
ఇలా ప్రియుడు మాట వినడం ఎంత పెద్ద తప్పు అన్నది తర్వాత కాలంలో అర్దమైందంది. ఇదే సమయంలో మళ్లీ కంబ్యాక్ ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు పరిశ్రమలో తనని చూసే విధానం మారిందని అంది. తనని తప్పుగా వాడుకోవాలని చాలా మంది చూసారని..అడ్జెస్ట్ మెంట్ కావాలని అడిగేవారని తెలిపింది. ప్రియుడికి దూరంగా చిన్న చిన్న కారణాలతో దూరమైనా ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో గొడవ ముదిరడంతో పరిస్థితులు మరింత దిగజారాయని పేర్కొంది.
ఆ సమయంలో ప్రియుడు చినిగిన బట్టలతో రోడ్డున పడ్డాడని..అదే సమయంలో సమయంలో తనని తప్పుగా వాడుకో వాలని...రాత్రి సమయంలో ఫోన్లు చేసి పిలవడం..అసభ్యంగా మాట్లాడటం వంటివి కొందరు చేసారని వాపోయింది. ఇంకా పెళ్లి కాకుండానే పిల్లల్ని కన్నట్లు తప్పుడు ప్రచారం చేయించా రని...ఇంతవరకూ తాను పెళ్లి చేసుకోలేదని తెలిపింది.