Begin typing your search above and press return to search.

సీక్వెల్ చేత కాదంటున్న క్రియేటివ్ డైరెక్టర్..!

ఐతే ఈమధ్య మురారి సినిమా రీ రిలీజ్ వల్ల కృష్ణ వంశీ సినిమాల గురించి ఆయన డైరెక్షన్ కెపాసిటీ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు

By:  Tupaki Desk   |   14 Aug 2024 5:30 PM GMT
సీక్వెల్ చేత కాదంటున్న క్రియేటివ్ డైరెక్టర్..!
X

ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం వస్తుంది అంటే ఏ సినిమా వచ్చినా ఏ సినిమా రాకపోయినా బుల్లితెర మీద ఖడ్గం సినిమా మాత్రం వచ్చి తీరుతుంది. ఈరోజు ఆ సినిమా వేయడం అదో సెంటిమెంట్ గా భావిస్తారు. ఎన్నో దేశ భక్తి సినిమాలు వచ్చినా ఖడ్గం సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన సినిమాలో రవితేజ, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, సోనాలి బింద్రే, సంగీత ఇలా అందరు తమ బెస్ట్ ఇచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది.

ఐతే ఈమధ్య మురారి సినిమా రీ రిలీజ్ వల్ల కృష్ణ వంశీ సినిమాల గురించి ఆయన డైరెక్షన్ కెపాసిటీ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా నెటిజెన్లు ఏం అడిగినా సరే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కృష్ణవంశీ వారి డౌట్లు తీర్చేస్తున్నారు. ఐతే లేటెస్ట్ గా ఖడ్గం సినిమా సీక్వెల్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా ఖడ్గం 2 తీస్తారా అని ఓ నెటిజన్ అడిగితే మాత్రం షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు కృష్ణ వంశీ. సీక్వెల్స్ ఉండవు.. తనకు చేతకాదని చెప్పి షాక్ ఇస్తున్నారు కృష్ణ వంశీ.

ఖడ్గం 2 ఉండకపోవచ్చు కానీ సామాజిక అంశాల మీద ఒక సినిమా అయితే చేస్తానని అన్నారు కృష్ణవంశీ. మురారి రీ రిలీజ్ తో కృష్ణ వంశీ తిరిగి ఫాం లోకి వచ్చినట్టే కనిపిస్తున్నారు. ఎప్పుడో 23 ఏళ్ల క్రితం తీసిన సినిమా వల్ల ఆయన ఇప్పుడు ఫాం లోకి రావడం ఏంటని అనుకోవచ్చు. సీనియర్ డైరెక్టర్స్ ఇప్పుడు తీస్తున్న ఫ్లాప్ సినిమాలను చూసి వారి కెపాసిటీ ఇంతేనా అనుకుంటారు కానీ కృష్ణవంశీ ఏంటన్నది మురారి రీ రిలీజ్ టైం లో ఆయన చేసిన సముద్రం, అంతపురం, ఖండం సినిమాల గురించి తెలుసుకునేలా చేసింది. సో ఆయన ఒక్కసారి మళ్లీ అలాంటి సినిమా చేస్తే చూడాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.

సినిమా మీద ప్యాషన్ ఉన్న డైరెక్టర్స్ అంతా కూడా తాము ఎంచుకున్న కథ ఎలాంటిదైనా దానికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు. కృష్ణవంశీ కూడా అంతే తను డైరెక్ట్ చేసిన తొలి ప్రయత్నం నుంచి తీసిన ప్రతి సినిమా విషయంలో ఆయన చాలా డెప్త్ గా వెళ్లి తీశారు. ఐతే కొన్నాళ్లకు ఆయన ఫాం కోల్పోయి వరుస ఫ్లాపులు తీయడం వల్ల ఆయనకు ఛాన్స్ లు లేకుండా పోయాయి. లాస్ట్ ఇయర్ రంగమార్తాండ చేసిన కృష్ణవంశీ నెక్స్ట్ ఏ సినిమా చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని కృష్ణవంశీ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.