సేతుపతి తో మినిస్టర్ భార్య సినిమా
ఇప్పటికే కిరుతిగా ఉదయనిధి దర్శకత్వంలో మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ వచ్చాయి. కానీ అవేమీ అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు.
By: Tupaki Desk | 22 Feb 2025 1:30 PM GMTతమిళనాడు డిప్యూటీ సీఎం, మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ గురించి అందరికీ పరిచయమే. ఆయన భార్య కిరుతిగా ఉదయనిధి కూడా దర్శకురాలిగా మారి పలు సినిమాలు చేసి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలని చూస్తుంది. ఇప్పటికే కిరుతిగా ఉదయనిధి దర్శకత్వంలో మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ వచ్చాయి. కానీ అవేమీ అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు.
దీంతో ఆమె ఈ సారి ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని డిసైడింది. మంచి బలమైన కథతో ఒక బడా హీరోతో సినిమా చేసి ఎలాగైనా హిట్ అందుకోవాలని చాలా కసిగా చూస్తోంది కృతిక. ఈ నేపథ్యంలోనే కిరుతిగా ఉదయనిధి తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమాను ప్రారంభించనుందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
డైరెక్టర్ గా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కిరుతిగా ఉదయనిధి రీసెంట్ గా రవి మోహన్, నిత్యా మీనన్ జంటగా కాదలిక్క నేరమిల్‌లై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా జనవరి 4న రిలీజై బాక్సాఫీస్ వద్ద మిక్డ్స్ టాక్ ను తెచ్చుకుంది. కాదలిక్క నేరమిల్‌లై లో కొన్ని సీన్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయని విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది కృతిక.
ఇప్పుడు కిరుతిగా ఉదయనిధి తన నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తాను రాసుకున్న కథకు విజయ్ సేతుపతి అయితేనే సరిగా న్యాయం చేయగలడని ఆయనతో చేయాలని చూస్తుందట కృతిక. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశామున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే మాత్రం వీరి కాంబోలో వచ్చే సినిమాకు స్పెషల్ క్రేజ్ ఏర్పడటం ఖాయం.
ఇక సేతుపతి సినిమాల విషయానికొస్తే గతేడాది విడుదలై-2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మక్కల్ సెల్వన్ ఆ మూవీతో కోలీవుడ్ లో మంచి హిట్టే అందుకున్నాడు. కానీ తెలుగులో మాత్రం విడుదల2 మూవీకి అనుకున్నంతగా ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం సేతుపతి ఆర్ముగ కుమార్ దర్శకత్వంలో ఏస్, మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.