హీరోలను 'గే'లతో పోల్చిన సుచీపై హీరో వైఫ్ ఫైరింగ్!
వీరంతా హిజ్రాలు అంటూ సుచీ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
By: Tupaki Desk | 22 May 2024 3:00 AM GMTసుచీ అలియాస్ సుచిత్ర మరోసారి యూట్యూబ్ ఇంటర్వ్యూలలో చెలరేగుతున్న సంగతి తెలిసిందే. నాటి సుచీలీక్స్ వ్యవహారాన్ని ఇప్పటికీ మర్చిపోని ప్రజలకు ఇది సెకండ్ సీజన్ ట్రీట్‌లా మారింది. అయితే పలువురు అగ్ర కథానాయకులపై సుచిత్ర చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గాయని కం రేడియో జాకీ సుచిత్ర ఇటీవలి ఇంటర్వ్యూలో దళపతి విజయ్, విశ్వనటుడు కమల్ హాసన్, శింబు, ధనుష్, షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ వంటి సినీ సెలబ్రిటీలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆ తర్వాతా ఈ జాబితాలో కొత్త పేర్లు చెబుతూనే ఉంది. వీరంతా హిజ్రాలు అంటూ సుచీ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
తన మాజీ భర్త కార్తీక్ కుమార్‌ను 'గే' అని అతడు ప్రముఖ హీరోతో కలిసి నైట్ పార్టీలకు వెళతాడని కూడా ఆమె ఆరోపించింది. ఇప్పుడు కార్తీక్ నేరుగా తన మాజీ భార్య సుచిత్రకు లీగల్ నోటీసు పంపాడు. అయితే సుచిత్ర దీనిపై ఇంకా స్పందించలేదు. గాయని సుచిత్ర చేసిన తీవ్ర ఆరోపణలపై నటుడు కమ్ రాజకీయవేత్త ఉదయనిధి స్టాలిన్ భార్య కిరుతిగ ఉదయనిధి స్పందించడం గమనించదగ్గ విషయం.
తాజా వివాదంలో కిరుతిగ ఉదయనిధి పరోక్షంగా సుచిత్రపై విరుచుకుపడ్డారు. ఆమె ఆగ్రహంతో విరుచుకుపడింది. X (ట్విట్టర్) ఖాతాలో కిరుతిగ ఒక నోట్ రాసారు. కొన్ని ఇంటర్వ్యూలను మరో 50 మంది సమీక్షించడం వల్ల ప్రయోజనం ఏమిటో ఎవరైనా నాకు చెప్పగలరా? సోషల్ మీడియాలో వ్యక్తుల దుర్బలత్వాన్ని ఉపయోగించుకోవడం నాసిరకం..! అని సీరియస్ అయ్యారు. సుచిత్ర వివాదాస్పద ఇంటర్వ్యూలను కిరుతిగ స్టాలిన్ పరోక్షంగా ప్రశ్నించారు. సుచిత్ర చాలా యూట్యూబ్ ఛానెల్‌లలో కనిపిస్తోంది. పరిశ్రమలోని ప్రముఖ సినీ తారలపై బహిరంగంగా ఆరోపణలు చేసింది. చివరకు బాలీవుడ్ నటీనటులను కూడా ఎంపిక చేసుకుని టార్గెట్ చేస్తోంది.
సుచిత్రపై కిరుతిగ ఉదయనిధి చేసిన విమర్శలపై ఇప్పుడు నెటిజన్లు స్పందిస్తున్నారు. పలువురు నెటిజనులు కిరుతిగా పోస్ట్‌కు మద్దతు ఇచ్చారు. ఒక X ఖాతాదారు ఇలా రాసారు. ప్రతిఒక్కరూ ఎంత నిరుద్యోగులుగా ఉన్నారో ఈ దృశ్యం చూపిస్తుంది! అని వ్యాఖ్యానించాడు. రెండవ వ్యక్తి వ్యాఖ్యానిస్తూ ``ఈ రోజుల్లో ఇంటర్వ్యూలు అర్ధంలేనివి.. వారు చట్టవిరుద్ధంగా చెల్లించిన డబ్బు కోసం ప్రజలను తప్పుగా అభివర్ణిస్తూ తారుమారు చేస్తున్నారు.. అని పేర్కొన్నారు. ఉద్యోగాలు లేని వ్యక్తులకు మరేదైనా మంచి వినోదం ఉందా? ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగదారులకు? ఆన్‌లైన్ గేమ్‌లు ఇప్పుడు బోరింగ్‌గా ఉన్నాయి అని ఒకరు వ్యాఖ్యానించారు. ఆ సమీక్షకులందరూ ఇతరుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గాసిప్‌ల కోసం మాత్రమే పని చేస్తారు.. వారు సామాజిక సమస్యల గురించి ఎప్పుడూ పట్టించుకోరు.. అని కూడా ఒకరు వ్యాఖ్యానించారు.
తన మాజీ భర్త కార్తీక్ .. అతడి స్నేహితుడైన ప్రముఖ తమిళ హీరో స్వలింగ సంపర్కులు అంటూ సుచిత్ర కామెంట్ చేయగా.. కార్తీక్ ఆమెకు లీగల్ నోటీసు పంపారు. అంతేకాదు ఇంటర్వ్యూలో సుచిత్ర తన వ్యక్తిగత విషయాలను చర్చించడం మానుకున్నట్లు కూడా కార్తీక్ పేర్కొన్నాడు. ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటే పరువు నష్టం కేసు పెడతానని సుచిత్రను కార్తీక్ హెచ్చరించాడు.