ఆయన జీవితంలో హీరో ఇంకా డౌటేనా?
దివంగత గాయకుడు-నటుడు కిషోర్ కుమార్ బయోపిక్ ని వెండి తెరకెక్కించే ప్రయత్నాలు కొంత కాలంగా జరుగు తోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 24 Oct 2024 9:30 AM GMTదివంగత గాయకుడు-నటుడు కిషోర్ కుమార్ బయోపిక్ ని వెండి తెరకెక్కించే ప్రయత్నాలు కొంత కాలంగా జరుగు తోన్న సంగతి తెలిసిందే. అనురాగ్ బసు దర్శకత్వంలో భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసినట్లు వార్త లొస్తున్నాయి. అయితే కిషోర్ పాత్ర విషయంలో నటుడు ఎవరు? అన్నది ఇంవరకూ సరైన క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే కిషోర్ పాత్రలో అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, షాహిద్ కపూర్ పేర్లు తెరపైకి వచ్చాయి.
ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు నటించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రేసులోకి మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ వచ్చి చేరారు. అమీర్ సైతం అనురాగ్ తో మంతనాలు జరుపు తున్నట్లు సమాచారం. నటుడు ఫైనలైజ్ అవ్వకపోవడంతోనే అమీర్ ఖాన్ అనురాగ్ తో ఇంటారక్ట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం అమీర్ ఖాన్ ఒక్కో ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టుకుంటూ వస్తున్నారు. `చార్ దిన్ కీ జిందగీ`, `గజని-2`, `ఉజ్వల్ నికమ్ బయోపిక్`, ఓ సూపర్ హీరో ఫిల్మ్ సహా లోకేష్ కనగరాజ్ తోనూ టచ్ లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ లన్నీ తానే స్వయంగా టేకప్ చేయాల్సిందిగా ముందుకెళ్తున్నాడు. నటుడిగానే కాకుండా సొంత నిర్మాణ సంస్థలోనే వాటిని నిర్మించాలని అమీర్ ముందుకు కదులుతున్నారు.
ఈనేపథ్యంలో కిషోర్ కుమార్ కథలోకి అమీర్ ఎంటర్ అవ్వడం ఆసక్తికరంగా మారుతుంది. మరి తుదిగా ఆ ఛాన్స్ ఎదరు దక్కించుకుంటారో చూడాలి.ప్రస్తుతం అమీర్ ఖాన్ సితారే జమీన్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. కుమారుడు జునైద్ ఖాన్, మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కెరీర్ లను సెట్ చేసే పనిలో ఉన్నారు. వాళ్లిద్దరి సినిమాల్ని తానే నిర్మిస్తున్నారు.