బికినీలో టీవీ నటి దుమారం
కిష్వెర్ మర్చంట్ ప్రముఖ టెలివిజన్ నటి కం మోడల్. ఏక్ హసీనా థీ - ఇత్నా కరో నా ముఝే ప్యార్ షోలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు
By: Tupaki Desk | 16 Aug 2024 8:30 PM GMTకిష్వెర్ మర్చంట్ ప్రముఖ టెలివిజన్ నటి కం మోడల్. ఏక్ హసీనా థీ - ఇత్నా కరో నా ముఝే ప్యార్ షోలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రియాలిటీ షో `బిగ్ బాస్ 9వ సీజన్లో పాల్గొన్నారు. ఆమెకు జోడీగా అమన్ యతన్ వర్మ షోలో కనిపించారు. బిగ్ బాస్ సీజన్లో బలమైన కంటెస్టెంట్గా కనిపించిన కిష్వెర్ చివరి నిమిషంలో `టికెట్ టు ఫినాలే` టాస్క్ నుండి బలవంతంగా నిష్క్రమించవలసి వచ్చింది. రూ. 15 లక్షలతో అసంకల్పితంగా ఇంటి నుండి బయటకు వెళ్లారు. కిష్వెర్ సోషల్ మీడియాల్లో చాలా స్పీడ్ గా ఉంది. ఈ భామ బికినీ అవతార్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న టీవీ నటి కిష్వెర్ మర్చంట్ ఇటీవల తన కుమారుడు నిర్వైర్ ముస్లిం మత ఆచారాలు పాటిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కిష్వెర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఆమె భర్త- నటుడు సుయాష్ రాయ్ .. తమ కుమారుడు నిర్వైర్కు ప్రార్థన ఆచారాలను బోధిస్తూ కనిపించారు. ఈ వీడియోలో నిర్వైర్ స్కల్ క్యాప్ ధరించి ఉన్నాడు. కిష్వెర్ వీడియోపై ద్వేషపూరితమైన కామెంట్లు వినిపించాయి. ఆమె కుమారుడు నిర్వైర్ ని తీవ్రంగా ట్రోల్ చేసారు.
స్వతహాగా ముస్లిం అయిన కిష్వెర్ సుయాష్ రాయ్ (హిందువు)ని వివాహం చేసుకున్నారు. ఒక ముస్లిం ఎప్పుడైనా భగవాన్ లేదా రామ్ అనే పదాన్ని కూడా చెబుతాడా?? అని కామెంట్ చేసారు. వారు దానిని హర్**మ్గా భావిస్తారు. ఒక ముస్లిం ఎప్పుడైనా గుడికి వెళ్తారా? అంటూ కొందరు ప్రశ్నించారు. అయితే తన మూడేళ్ల కొడుకు నిర్వైర్ను ట్రోల్ చేయడం గురించి కిష్వెర్ను సంప్రదించినప్పుడు ఆమె స్వయంగా తాను ఒక ముస్లిమ్ని అని గురుద్వారా, చర్చిలో ప్రార్థనలు చేస్తున్నానని చెప్పారు. దీపావళి, క్రిస్మస్ వంటి అన్ని పండుగలను జరుపుకుంటానని, తన భర్త హిందువు కాబట్టి తన కొడుకు ఇతర మతం గురించి నేర్చుకుంటాడనే భయం తనకు లేదు అని అన్నారు. తాను ముస్లిం అని, అయితే తన కొడుకుకు హిందూ పేరు పెట్టానని, దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నందున తన కొడుకుకు ప్రతి మతాన్ని బోధిస్తానని కిష్వర్ అన్నారు.