వేదికలపై ముద్దులు కరెక్టేనా!
తాజాగా దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కూడా ఛోటా కె. లా హీరోయిన్ బుగ్గపై ముద్దు పెట్టి సంచలనమవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Aug 2023 12:04 PM GMTసినిమా వాళ్ల కల్చర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సాధారణ జీవితానికి చాలా భిన్నంగా రంగుల జీవితం కనిపిస్తుంది. ప్రతీ విషయాన్ని భూతద్దంలా పెట్టి చూస్తే అందులో తప్పే కనిపిస్తుంది తప్ప ఒప్పు కనిపించదు. వాళ్లతో ఉన్న అండ్ స్టాండింగ్ ..ర్యాపో కారణంగా ఆన్ సెట్స్ లో ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతుంటారు. ఒకర్ని ఒకరు హత్తుకుంటారు..ముద్దులు పెట్టుకుంటారు. గిల్లుకుంటారు.. గిచ్చుకుంటారు. ఇదంతా సినిమా సెట్స్ లో సరదాగా..స్నేహపూర్వకంగా చోటు చేసుకునే సన్నివేశాలు.
ఇవే సన్నివేశాలు పబ్లిక్ వేదికలపై చేసే సరికి వాటి రూపం..అర్ధం రెండు మారిపోతుంటాయి. ఎందుకంటే సినిమా అనే ప్రపంచానికి పూర్తి కాంట్రాస్ట్ గా సాధారణ జీవితం ఉంటుంది. భిన్నమైన వ్యక్తిత్వాలుంటాయి. అందరూ ఒకేలా ఉండాలని లేదుగా! అందుకే పబ్లిక్ లోకి వచ్చేసరికి జాగ్రత్తగా ఉండాలంటారు. అంటే మీడియా ముందు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ నేటి సోషల్ మీడియా యుగంలో మరింత జాగ్రత్త తీసుకోకపోతే సీన్ సితారైపోతుంది.
ఆ మధ్య కాజల్ అగర్వాల్ బుగ్గపై ఛాయాగ్రాహకుడు ఛోటా.కె. నాయుడు ముద్దు పెట్టిన సన్నివేశం సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. కాజల్ తో ఉన్న స్నేహం..అభిమానం కారణంగా అలా చేసినా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పబ్లిక్ లో ఆ పాడు పనులేంటని విమర్శించారు. ట్రోలర్లకి ఆహారంగానూ మారిపోవాల్సి వచ్చింది. తాజాగా దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కూడా ఛోటా కె. లా హీరోయిన్ బుగ్గపై ముద్దు పెట్టి సంచలనమవుతోన్న సంగతి తెలిసిందే.
ఆయన దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా..మన్నారా చోప్రా హీరోయిన్ గా 'తిరగడబారా సామి' అనే సినిమాలో తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ భుజంపై చేయి వేయడం..బుగ్గపై ముద్దు పెట్టడంతో సోషల్ మీడియాలో మరోసారి అగ్గి రాజుకుంది. ముద్దు పెట్టడంలో ఛాటోకే తర్వాత స్థానం ఈయనదే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అంతకు ముందు ఓ హీరోయిన్ సినిమా ఈవెంట్లో ఓ స్టార్ హీరోని వచ్చి హత్తుకోవడం... చేతులు నులుపడం వంటి సన్నివేశాలు కూడా జనాల్లోకి నెగిటివ్ గానే వెళ్లాయి. మరి వీటిని సెలబ్రిటీలు ఎంత సీరియస్ గా తీసుకున్నారు? అన్నది తెలియదుగానీ! సమాజంలో మాత్రం నెగిటివ్ గానే ఫోకస్ అవుతున్నాయి.