Begin typing your search above and press return to search.

కెఎల్ రాహుల్- ఆతియా జంట‌ శుభ‌వార్త‌

సోషల్ మీడియాలో తమ అభిమానులతో ఈ సంతోష‌కరమైన వార్తను షేర్ చేసారు.

By:  Tupaki Desk   |   24 March 2025 4:52 PM
Kl Rahul Athiya Shetty birth to baby girl
X

స్టార్ క్రికెట‌ర్ కెఎల్ రాహుల్- ఆతియా జంట త‌ల్లిదండ్రుల‌య్యారు. ఈ జంట మొద‌టి సంతానంగా ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. సోషల్ మీడియాలో తమ అభిమానులతో ఈ సంతోష‌కరమైన వార్తను షేర్ చేసారు. రెండు హంసల పెయింటింగ్‌ను పోస్ట్ చేసి, దానిలో ''ఆడపిల్లతో ఆశీర్వాదం అందుకున్నాము'' అని రాసారు.

ఈ సోమవారం శిశువు జన్మించింది... 24-03-2025 అని తేదీని తెలిపారు. న‌టుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా - కెఎల్ రాహుల్ ఏమీ రాయకుండా ఫోటోని మాత్రం షేర్ చేసారు. కానీ హాలో - రెక్కల ఎమోజితో ఒక బిడ్డను ఉంచారు. కొత్త తల్లిదండ్రులకు వారి చిన్నారితో జీవితాంతం ప్రేమ, ఆనందం ఉండాలని కోరుకుంటూ అభినందన సందేశాలను షేర్ చేసారు. మీ ప్రియమైన చిన్న దేవదూత బొమ్మకు అభినందనలు, ప్రేమ, ఆశీర్వాదాలు...'' అని రాశారు. అయితే చాలామంది హార్ట్ ఈమోజీలను షేర్ చేసారు. గత సంవత్సరం నవంబర్‌లో అతియా శెట్టి - కెఎల్ రాహుల్ తమ అభిమానులకు -శ్రేయోభిలాషులకు శుభవార్తను ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత అతియా బేబి బంప్ వేడుక హైలైట్ అయింది.

జనవరి 2019లో కెఎల్ రాహుల్ ఒక పరస్పర స్నేహితుడి ద్వారా న‌టి ఆతియాను కలిశాడు. ఈ జంట‌ తక్షణమే కనెక్ట్ అయ్యారు. అప్పటి నుండి వారి రిలేష‌న్ సంవత్సరాలుగా వికసించింది. చాలా సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత అతియా 2023లో కెఎల్ రాహుల్‌ను వివాహం చేసుకుంది. ఈ వివాహం ఖండాలాలోని సునీల్ ఫామ్‌హౌస్‌లో సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగింది.