Begin typing your search above and press return to search.

క్లీన్ కారాను ఇంకా ఎన్నాళ్లు దాచి పెడ‌తారు?

By:  Tupaki Desk   |   31 March 2025 7:11 AM
క్లీన్ కారాను ఇంకా ఎన్నాళ్లు దాచి పెడ‌తారు?
X

రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న‌ల గారాల ప‌ట్టి క్లీన్ కారా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క్లీన్ కార రాక‌తో ఆ ఇంటికి కొత్త శోభ తోడైంది. క్లీన్ కారా అల్ల‌రి ప‌నుల‌తో ఇల్లంతా సంద‌డిగా మారిపోయింది. చ‌ర‌ణ్ కి షూటింగ్ లు లేపోతే కుమార్తెతోనే ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఉపాస‌న ఆసుప‌త్రి వ్య‌వ‌హారాల అనంత‌రం కుమార్తెకే స‌మ‌యా న్ని కేటాయిస్తున్నారు. మిగ‌తా స‌మ‌యాల్లో నాయ‌న‌మ్మ‌-తాత‌య్య‌ల‌తో క్లీన్ కారా ఆడుకుంటుంది.

తాజాగా క్లీన్ కారా తొలి ఉగాదిని అమ్మ‌-నాయ‌న‌మ్మ‌తో గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేస‌కుంది. పూజ‌గ‌దిలో నాయ‌న‌మ్మ ప‌క్క‌నే కూర్చుని పూజ‌లు చేసింది. క్లీన్ కారాను ప్ర‌త్యేకంగా ముస్తాబు చేసి అంద‌మైన గౌను వేసారు. ఇల్లంతా తిరిగేస్తూ అల్ల‌రి చేసేస్తుంది. పూజ స‌మ‌యంలో నాయ‌న‌మ్మ ప‌క్క‌నే కూర్చుని శ్ర‌ద్ద‌గా చెప్పింది వింటుంది. అక్షింత‌లు అందుకుని దేవుడిపైనా విసిరింది. ఇలా ఉగాదిని పాపాయి ఎంతో గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంది.

ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. క్లీన్ కారా ముఖం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ అభిమానుల‌కు చూపిచంలేదు. క్లీన్ కారాను చూడాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. చ‌ర‌ణ్ బిడ్డ ఎలా ఉంటుంద‌ని త‌హ‌త‌ళ‌లాడుతున్నారు. కానీ ఎందుక‌నో క్లీన్కారాని ఇంకా అభిమానుల‌కు చూపించ‌లేదు. ప‌రిచ‌యం కూడా చేయ‌లేదు. ఏ కార‌ణంతో ఈ గోప్య‌త వ‌హిస్తున్నారో కూడా అర్దం కాని ప‌రిస్థితి .

క్లీన్ కారాకు జూన్ 20 వ‌స్తే ఏడాది పూర్త‌వుతుంది. అంటే ఆరు నెల‌లు స‌మ‌యం దాటిపోయింది. సాధా ర‌ణంగా ఆరు నెల‌ల వ‌ర‌కూ చిన్న పిల్ల‌ల విష‌యంలో ఇలాంటి గోప్య‌త వ‌హిస్తారు. ఆ త‌ర్వాత పాపాయి ముఖాన్ని అంద‌రికీ చూపిస్తుంటారు. కానీ 10 నెల‌లు గడుస్తున్నా? ఇంకా ఆ స‌స్పెన్స్ మెయింటెన్ చేస్తూనే ఉంది మెగా ఫ్యామిలీ.