క్లీంకార పాప.. లేటెస్ట్ లుక్ చూశారా?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 12 Dec 2024 1:03 PM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే. 2023 జూన్ 20వ తేదీన ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత మెగా ఇంటి గారాల పట్టికి క్లీంకార అని నామకరణం చేయగా.. దాని వెనుక ఉన్న చరిత్ర తెలిసి అంతా షాకయ్యారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచు జాతి నుంచి స్పూర్తి పొంది క్లీంకారగా నామకరణం చేశామని ఉపాసన కొద్ది రోజల క్రితం తెలిపారు. తల్లిదండ్రులు సాధించిన ఘనతను పిల్లలకు ట్యాగ్ చేయకూడదని, ఎవరి ఘనత వారే సాధించుకోవాలని కూడా ఉపాసన ఆ సమయంలో పేర్కొన్నారు.
అయితే క్లీంకార వయసు ఇప్పుడు 15 నెలలు అయినా.. ఆమె ఫేస్ ను ఇంకా క్లియర్ గా రివీల్ చేయలేదు మెగా ఫ్యామిలీ మెంబర్స్. పలు సందర్భాల్లో పిక్స్ షేర్ చేసినా ఫేస్ ను బ్లర్ చేస్తున్నారు. ఆ మధ్య తిరుమల వెళ్లినప్పుడు క్లీంకార ముఖం అనుకోకుండా కెమెరాలకు చిక్కినా.. అఫీషియల్ గా మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.
తాజాగా క్లీంకార కొత్త ఫోటోను షేర్ చేశారు ఉపాసన. తన తాతయ్యతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన ఫోటోను గురువారం పోస్ట్ చేశారు. తమ హాస్పిటల్ (అపోలో) ఆవరణలోని వెంకటేశ్వర స్వామి గుడిలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయని ఉపాసన తెలిపారు. క్లీంకార తన ముత్తాతతో అందులో పాల్గొందని చెప్పారు.
ఆ సమయంలో తన తాత చేతుల్లో ఉన్న క్లీంకారను చూస్తుంటే చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని ఉపాసన రాసుకొచ్చారు. ఆ దేవాలయం తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ప్రస్తుతం ఉపాసన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మెగా ప్రిన్సెస్ కొత్త పిక్ అంటూ అభిమానులు తెగ ట్రెండ్ చేస్తున్నారు.
తమ సోషల్ మీడియా వాల్స్ లో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. క్లీంకార అప్పుడే అంత పెద్ద పాప అయిపోయిందా అని కామెంట్లు పెడుతున్నారు. చూస్తుండగానే.. పెరిగిపోయిందని చెబుతున్నారు. చాలా హ్యాపీగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఫేస్ ను ఇంకెప్పుడు రివీల్ చేస్తారని అడుగుతున్నారు. మరి చూడాలి మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు రివీల్ చేస్తారో..