క్లీంకార కేర్ టేకర్ కి లక్షన్నర జీతం!
ఇక చరణ్ -ఉపాసనలు ఎక్కడికి వెళ్లినా వెంట పాపాయి క్లీంకార కూడా ఉంటుంది. ఆమెని ప్రత్యేకంగా చూసుకునేందుకు ఓ ఫేమస్ కేర్ టేకర్ ని కూడా నియమించుకున్నట్లు కనిపిస్తుంది.
By: Tupaki Desk | 4 Feb 2024 11:30 AM GMTక్లీంకార వచ్చిన వేళా విశేషం ఏమోగానీ మెగా ఫ్యామిలీ ఇంట ప్రతిష్టాత్మక అవార్డుల పంట పడుతోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నటించిన 'ఆర్ ఆర్ ఆర్' ఆస్కార్ అవార్డు..అటుపై బన్నీకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు..తాజాగా మెగాస్టార్ కి ఏకంగా దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవి భూషణ్ ఇలా అంతా అవార్డుల పంటే కనిపిస్తోంది. ఇదంతా క్లీంకార్ వచ్చిన తర్వాత చోటు చేసుకోవడంతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది.
ఇక చరణ్ -ఉపాసనలు ఎక్కడికి వెళ్లినా వెంట పాపాయి క్లీంకార కూడా ఉంటుంది. ఆమెని ప్రత్యేకంగా చూసుకునేందుకు ఓ ఫేమస్ కేర్ టేకర్ ని కూడా నియమించుకున్నట్లు కనిపిస్తుంది. చరణ్-ఉపాసన ఎక్కడికి వెళ్లినా నర్సు అవతారంలో ఆ పెద్దావిడ కూడా కనిపిస్తుంది. ఇంత కాలం ఆవిడ మీద ఫోకస్ పెట్టని మీడియా ఒక్కసారిగా ఫోకస్ పెట్టేసరికి చాలా వివరాలే వెలుగులోకి వస్తున్నాయి. ఆమె పేరు సావిత్రి.
కేర్ టేకర్ గా ఆమె ఎంతో ఫేమస్. గతంలో కరీనాకపూర్ కుమారుడు తైమూర్ అలీఖాన్ కి కేర్ టేకర్గా పనిచేసింది ఆవిడ. ఓ ఇంటర్వ్యూలో కూడా కరీనా సావిత్రి గురించి చెప్పడం విశేషం. ఇప్పుడు క్లీంకార కోసం ఆమెని నియమించుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ దంపతులు ఆమెకు నెలకు లక్షన్నర జీతం ఇస్తున్నారుట. ఆమెకంటూ ప్రత్యేకమైన వసుతులు..సౌకర్యాలు కూడా కల్పించినట్లు తెలుస్తోంది. అవి అదనం.
క్లీంకార కాస్త పెద్దది అయ్యే వరకూ సావిత్రమ్మ బాధ్యతలు చూసుకుంటుంది. చరణ్..ఉపాసనలు డైలీ లైఫ్ లో వాళ్ల బిజీలో వాళ్లు ఉంటారు. చరణ్ కి సినిమా షూటింగ్ లు..ఉపాసన అపోలో వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. క్లీంకార ఎదిగే వరకూ చూసుకునే ఓ మనిషి కూడా అవసరం పడటంతో ఆమెని ముంబై నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.