నేడు మెగా ఇంట సంబరాలే..ఎందుకంటే?
మెగా ఫ్యామిలీ ఇంట వారసురాలు అడుగు పెట్టి ఏడాది పూర్తవుతుంది. నేటితో క్లీన్ కారా మొదటి ఏడాదిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది
By: Tupaki Desk | 20 Jun 2024 7:24 AM GMTమెగా ఫ్యామిలీ ఇంట వారసురాలు అడుగు పెట్టి ఏడాది పూర్తవుతుంది. నేటితో క్లీన్ కారా మొదటి ఏడాదిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికా మెగా అభిమానులంతా క్లీన్ కారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. క్లీన్ కారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి ఎన్నో రకాలుగా కలిసొచ్చిందన్నది ఓ సెంటిమెంట్ గా మారింది.
రామ్ చరణ్ కు నేషనల్ వైడ్ స్టార్ డమ్ రావడం, చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం ఇలా అన్ని రకాలుగా మెగా ఫ్యామిలీ ఇంట సంతోషమే కనిపిస్తుంది. కానీ క్లాన్ కారా ఎలా ఉంటుంది? అన్నది మాత్రం అభిమానులకు ఇంకా చూపించలేదు. దీంతో క్లీన్ కారాని చూడాలని అభిమానులంతా ఎంతో ఎగ్జెట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అమ్మ పోలిక, నాన్న పోలిక, తాత పోలిక అంటూ ఎవరూ ఊహల్లో వారు తేలుతున్నారు.
నేడు పుట్టిన రోజును పురస్కరించుకుని ఉపాసన ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసారు. ఈ వీడియోలో 'ఉపాసన ప్రగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బేబీ పుట్టేంతవరకు ఎలా ఫీల్ అయ్యారో చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తమని అందరూ పిల్లల గురించి అడిగేవారని, పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత పాప పుట్టడం అందరికి హ్యాపీగా ఉందన్నారు. క్లీన్ కారిని తొలిసారి ఎత్తుకున్నప్పుడు మర్చిపోలేని అనుభూతికి లోనైనట్లు గుర్తు చేసుకున్నారు.
పాప పుట్టినప్పుడు అభిమానులంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్తూ ఎమోషనల్ అయ్యారు చరణ్- ఉపాసన. అలాగే ఉపాసన ప్రగ్నెన్సీ నుంచి పాప పుట్టి బారసాల అయి పేరు అనౌన్స్ చేసే వరకు విజువల్స్ గా చూపించారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి మెగా ఇంట సంబరాలు ఏం రేజులో జరుగుతున్నాయో తెలియాల్సి ఉంది.