నారాయణ ఎంట్రీ పాన్ ఇండియాలో ఇలా!
సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 May 2024 7:07 AM GMTసూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్స్ట్ అధినేత కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే కె.ఎల్ నారాయణ సినిమా నిర్మించడం ఏంటి? అన్న సందేహం ప్రాజెక్ట్ గురించి బయటకు రాగానే అంతా ఆశ్చర్యం వ్యక్తం చేసిన వారెంతో మంది. ఎందుకంటే ఈ సంస్థ చాలా కాలంగా యాక్టిగ్ గా లేదు. సినిమాలు నిర్మించలేదు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్నో అగ్ర నిర్మాణ సంస్థలున్నాయి. రాజమౌళి ఊ కోడితే వందల కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. అన్ని అవకాశాలున్నా రాజమౌళి మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఎప్పుడో సినిమాలు తీసిన సంస్థతో మహేష్ సినిమా ఏంటి? అన్న డౌట్ చాలా మంది మదిలో ఉంది. తాజాగా వాటన్నింటికి సమాధానం ఇదేనని నారాయణ మాటల్ని బట్టి తెలుస్తోంది. ఈ ముగ్గురి కలయిక ఇప్పుడు జరిగింది కాదు. 15 ఏళ్ల క్రితమే బీజం పడింది.
అప్పటికి రాజమౌళి సాధారణ కమర్శియల్ సినిమాలు చేస్తున్నారు. మహష్ కూడా స్టార్ గా తన ఇమేజ్ ని రెట్టింపు చేసుకుంటోన్న సమయం. అప్పుడు చేయాలనుకున్న సినిమా రాజమౌళి పాన్ ఇండియా ని దాటి పాన్ వరల్డ్ లో ఫేమస్ అయిన తర్వాత చేయడం వివేషం. రకరకాల కారణాలతో నారాయణతో సినిమా చేయడం కుదరలేదని తెలుస్తోంది. అయినా సరే రాజమౌళి-మహేష్ మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటకి కట్టుబడి తమ సంస్థ యాక్టివ్ లో లేకపోయనా రీచార్జ్ అయ్యేలా చేసారు.
సాధారణంగా ఇలాంటి చాన్స్ ఏ దర్శక-హీరో తీసుకోరు. బోలెడు సంస్థలున్నాయి. కోట్లు ఖర్చు చేసే నిర్మాణ సంస్థలుండగా? మళ్లీ ఆ సంస్థతో సినిమా ఏంటి? ఇంకా ఎక్కువ పారితోషికంగా వస్తుందని అనుకుంటారు. కానీ రాజమౌళి-మహేష్ అలా భావించలేదు. అప్పుడు ఇచ్చిన మాట కోసం రాజమౌళి నిర్మాణానికి దూరంగా ఉన్న నారయణని..గోపాల్ రెడ్డిని స్వయంగా ఒప్పించి మరీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తున్నారు. గతంలో ఈ సంస్థలో `హలో బ్రదర్`, `క్షణ క్షణం`, `దొంగాట` లాంటి బ్లాక్ బస్టర్లు రూపొందిన సంగతి తెలిసిందే. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న కొత్త సినిమా ప్రారంభించే అవకాశాలున్నాయంటున్నారు.