హీరోయిన్ పై హీరో పెద్ద రాజకీయమే!
అవకాశం వస్తే కదా? నిరూపించుకునేది. ఛాన్స్ ఇచ్చినప్పుడు పనికొస్తామా? పనికిరామా? అన్నది తెలిసేది
By: Tupaki Desk | 23 Nov 2023 5:30 PM GMTఅవకాశం వస్తే కదా? నిరూపించుకునేది. ఛాన్స్ ఇచ్చినప్పుడు పనికొస్తామా? పనికిరామా? అన్నది తెలిసేది. కానీ అవకాశం రాకుండానే కొందరు తొక్కేయాలని చూస్తారు. సరిగ్గా బాలీవుడ్ నటి అలియాభట్ విషయంలోనూ అదే జరిగింది. ఆ నాడు కరణ్ జోహార్ గనుక తెగించి అవకాశం ఇవ్వకపోయినా..పక్కవారి చెడు మాటలు చెవికి ఎక్కించుకున్నా? అలియాభట్ కెరీర్ మరోలా ఉండేది.
అవును ఛాన్స్ ఇచ్చి మంచి పనిచేసాను అని కరణ్ తాజాగా తన టాక్ షో సాక్షిగా తెలిపాడు. నటిగా అలియా పెద్ద సక్సెస్ అయినందుకు తానెంతో గర్వపడుతున్నాని సంతోషంగా చెబుతున్నాడు. మరి ఇంతకీ అలియాభట్ పై రాజకీయం చేసిన హీరో ఎవరు? ఎందుకు ఆమెపై రాజకీయం చేయాల్సి వచ్చింది? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
అలియాభట్ బాలీవుడ్ లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అందులో వరుణ్ ధావన్.. సిద్దార్ధ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహర్ తెరకెక్కించారు. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు కరణ్ కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పంచుకున్నారు. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ఆ రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి. సినిమా పట్టాలెక్కడానికి ముందు అలియా..సిద్దార్ద్..వరుణ్ ధావన్ ముగ్గురు కలిసాం.
స్టోరీ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడే అలియాభట్ ని హీరోయిన్ గా తీసుకోవద్దని వరుణ్..సిద్దార్ద్ నాకు మెసేజ్ లు పంపించారు. ఆమె చూడటానికి చిన్న పిల్లలా ఉంది. సినిమాకి పనికొచ్చేలా లేదు. వేరే వాళ్లను తీసుకోండి అని సలహా ఇచ్చారు. వాళ్ల మాటలు పట్టించుకోకుండా నేను ఓ రోజు ఫోటో షూట్ చేసాను. ఆ తర్వాత కూడా వరుణ్ నాకు వేరే అమ్మాయిల ఫోటోలు పంపించాడు.
వాళ్లలో ఎవరో ఒకర్నీ తీసుకోమని నాపై ఒత్తిడి తెచ్చాడు. కానీ నేను వినలేదు. అలియానే ఆ పాత్రకి ఫిక్స్ ఆమెతో సినిమా చేసాను. అలా ప్రవేశించిన నటి నేడి జాతీయ ఉత్తమ నటి అయింది` అన్నాడు. ఆ సినిమా తో అలియాకి మంచి పేరు వచ్చింది. వరుసగా అవకాశాలు అందుకుని బిజీ నటి కాగలిగింది. ఆ రోజు ఆ ఛాన్స్ రాకపోయి ఉంటే? ఆమె జీవితం మరోలా ఉండేదేమో.