భార్యాభర్తలపై ట్రోలింగ్ సీరియస్ అయిన హోస్ట్!
సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పొర పాటున నోరు జారితే అడ్డంగా బుక్కైనట్లే
By: Tupaki Desk | 14 Dec 2023 11:15 AM GMTసెలబ్రిటీలపై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పొర పాటున నోరు జారితే అడ్డంగా బుక్కైనట్లే. తాజాగా ఇటీవలే కాపీ విత్ కరణ్ టాక్ షోలో అతిధులుగా పాల్గొన్న రణవీర్ సింగ్-దీపిక పదుకొణే లు పెళ్లికి ముందు తమ రిలేషన్ షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లవ్ ప్రపోజ్ చేసుకునే వరకూ రిలేషన్ షిప్ విషయంలో తాము సీరియస్ గా...వేరే వాళ్లతోనూ ప్రెండ్లీగా ఉండేవాళ్లమని అన్నారు.
ఆ వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలతో ఇద్దరు ట్రోలింగ్ బారిన పడ్డారు. తాజాగా ఆ ట్రోలింగ్ పై కరణ్ జోహార్ సీరియస్ అయ్యారు. ఇతరుల విషయాల గురించి పట్టించు కోవడం కంటే మీ ఇంటి విషయాలు పట్టించుకుంటే మంచిదని ఆగ్రహం వ్యక్తం చేసారు. 'ఇప్పటి వరకూ దీపిక-రణవీర్ తో ఎన్నో ఇంటర్వ్యూలు చేసాను. కానీ ఇటీవల చేసిన ఇంటర్వ్యూ ది బెస్ట్.
పలు విషయాలపై..అభిప్రాయాలు..భావాలు పంచుకున్నాం. ఆ ఎపిసోడ్ లో ఇద్దరు మనస్పూర్తిగా మాట్లాడారు. రిలేషన్ షిప్ గురించి నిజాయితీగా మాట్లాడారు. అలా మాట్లాడటం తప్పు అవుతుందా? టెలికాస్ట్ అయిన తర్వాత ఇష్టాను సారం కామెంట్లు చేసారు. అవి చూసి నాకెంతో కోపం వచ్చింది. ఆ పోస్టులు చూసిన తర్వాత నాకు ఒటకే అనిపించింది. వేరే వాళ్ల వ్యక్తిగత జీవితం..వైవాహిక జీవితం గురించి మీకేం తెలుసు? అని చెప్పాలనిపించింది' అని అన్నారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈసారి కరణ్ వ్యక్తిగతంగా టార్గెట్ అవుతున్నారు. ఆయన పాత ఇంటర్వ్యూల్లో కొందరి హీరోయిన్లను అభ్యంతరక ప్రశ్నలు అడిగిన తీరును గుర్తు చేస్తున్నారు. మరి కరణ్ సాబ్ వాటికి ఏమని బధులిస్తారో చూడాలి. కరణ్ తో కాఫీ తాగడం అంటే సెలబ్రిటీలు అన్ని రకాలుగా సంసిద్దం అయి ఉండాలని నెటి జనులు అభిప్రాయపడుతున్నారు.