Begin typing your search above and press return to search.

వీడియో: లండ‌న్ వీధిలో కోహ్లీ ఊహించ‌ని షాక్‌

అదే కాకుండా త‌మ పిల్ల‌ల‌కు కూడా ఇస్కాన్ సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను చిన్న‌ప్ప‌టి నుంచే అల‌వ‌రిచే దిశ‌గా త‌ల్లిదండ్రుల ఆస‌క్తి క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   15 Aug 2024 9:30 AM GMT
వీడియో: లండ‌న్ వీధిలో కోహ్లీ ఊహించ‌ని షాక్‌
X

టీమిండియా స్టార్ బ్యాట్స్ మ‌న్ విరాట్ కోహ్లీ త‌న భార్య‌, వార‌సులతో క‌లిసి లండ‌న్ లో నివ‌శిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల లండన్‌లోని ఇస్కాన్ దేవాల‌యంలో కీర్త‌న్స్, భ‌జ‌న్స్ లో నిష్ఠ‌గా పాల్గొంటున్న ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి. విరాట్‌- అనుష్క శ‌ర్మ నిరంత‌రం లార్డ్ కృష్ణుని సేవ‌లో త‌రించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్ర‌స్తుత గేమ్ నుంచి పూర్తిగా విర‌మించాక ఆధ్యాత్మికత‌ను ఆశ్ర‌యించ‌డ‌మే ఉత్త‌మ మార్గం అని వారు భావిస్తున్నారు. అదే కాకుండా త‌మ పిల్ల‌ల‌కు కూడా ఇస్కాన్ సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను చిన్న‌ప్ప‌టి నుంచే అల‌వ‌రిచే దిశ‌గా త‌ల్లిదండ్రుల ఆస‌క్తి క‌నిపిస్తోంది.

ఇలాంటి స‌మ‌యంలో విరాట్ కోహ్లీ లండ‌న్ వీధుల్లో క‌నిపించిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అత‌డు ఒక సెల‌బ్రిటీ హోదాను వ‌దిలేసి చాలా సింపుల్ గా వీధుల్లో న‌డుచుకుంటూ వెళుతున్నారు. ఒక సామాన్యుడిలా వెంట మంది మార్భ‌లంతో ప‌ని లేకుండా ఒంట‌రిగా అలా వీధి దాటుతూ క‌నిపించాడు. ఇటీవ‌ల‌ శ్రీలంకతో జరిగిన భారత వన్డే సిరీస్‌లో పాల్గొన్న తర్వాత స్టార్ బ్యాటర్ కోహ్లీ ఇంగ్లాండ్ రాజధానికి తిరిగి వ‌చ్చారు. ఇంత‌లోనే లండన్‌లోని ఒక వీధిని దాటుతున్న విజువ‌ల్ వైర‌ల్ అయింది. తాను ఆ మార్గంలో వెళుతూ అటుగా వెళుతున్న కార్ వైపు ఏవో సంజ్ఞ‌లు చేస్తున్నారు. ఈ వీడియోని అభిమానులు వేగంగా వైర‌ల్ చేసారు.

కోహ్లి తన భార్య అనుష్క శర్మ -వారి పిల్లలు వామిక - అకాయ్‌లతో కలిసి లండన్ వెళ్లినప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బెంగళూరులో సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో పాల్గొనకుండా కోహ్లీకి విశ్రాంతి లభించింది. కోహ్లితో పాటు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ఆర్ అశ్విన్‌లకు జాతీయ సెలెక్టర్లు మినహాయింపు ఇచ్చారు. సెప్టెంబర్ 19 నుండి చెన్నైలో సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు కోహ్లీ సిద్ధ‌మ‌వుతాడు.